రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మద్వి మద్దా(30), బెంజు లఖ్ము(28)గా గుర్తించారు. మద్దాను జంగ్లా పోలీసు స్టేషన్ పరిధిలోను, లఖ్మును ఫర్సేగర్ పోలీసు స్టేషన్ పరిధిలోను మంగళవారం అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. వీరిద్దరూ హత్యాయత్నం, దాడులు, నిర్మాణ పనుల్లోని వాహనాల దగ్ధం వంటి నక్సల్స్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని వివరించారు. వీరిద్దరిని విచారిస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment