
సాక్షి, హైదరాబాద్: పాపులర్ పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్టు.. విలాసాలకు అలవాటుపడి దొంగగా మారాడు. చివరికి నాటకీయ రీతిలో పోలీసులకు చిక్కాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీసులు శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
బరి నాగరాజు అలియాస్ నరేందర్ ఇందిరానగర్‌లో నివసిస్తున్నాడు. మొదట్లో భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేసుకునే ఇతను పటాస్ కామెడీ షోలో అవకాశం చేజిక్కించుకున్నాడు. కొంతకాలానికి విలాసవంతమైన జీవితం అలవాటు కావడంతో డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. బైక్‌పై రెక్కీ తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి రాత్రే ఆ ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాడు. పక్కా ఆధారాలతో నాగరాజును పట్టుకున్నామని, గతంలో సెల్‌ఫోన్ చోరీ కేసులోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి దగ్గర్నుంచి సుమారు రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment