
సిద్దిపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి తన కారులో రూ. 1000 డిజిల్ పోయించుం కోగా సిబ్బంది అలసత్వంతో రూ. 100ది మాత్రమే పోసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భాదితుడు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..విద్యుత్ శాఖలో డీఈగా పని చేసే అధికారికి బాధితుడు కారును అద్దెకు తిప్పుతున్నాడు. శుక్రవారం ఎన్సాన్‌పల్లి రోడ్డులో కోమటిచెరువు దగ్గర ఉన్న బంకులో రూ. వేయి విలువ గల డీజిల్ కారులో పోయించుకున్నాడు.
డీజిల్ తక్కువ రావడంతో అనుమానంతో మెకానిక్‌తో చెక్ చేయించాడు. డిజిల్ తక్కువగా వచ్చిందని గుర్తించి సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. డిజిల్ పోయించుకున్న సమయంలో జరిగిన లావాదేవిలను పరిశీలించగా అందులో రూ. వెయికి బదులు కేవలం రూ. 100 డీజిల్‌ను మాత్రమే పోసినట్లుగా వెల్లడైంది.
ఈ విషయంపై నిర్వాహకులను నిలదీయగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సమాధానం ఇచ్చినట్లు బాధితుడు వాపోయాడు. తరువాత విషయం పట్టణంలో కలకలం రేగడంతో దిగివచ్చిన నిర్వాహకులు తక్కువ వచ్చిన డిజిల్‌తో పాటు అదనంగా మరో రూ. 500ల డిజిల్ పోస్తామని బేరమాడినట్లుగా బాధితుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment