కొవ్వూరులో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు చిత్రంలో రికవరీ సొత్తు
పశ్చిమగోదావరి , కొవ్వూరు: పట్టణంలో రెండు చోరీలకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను పట్టుకుని వారి నుం చి రూ.7.83 లక్షల విలువైన 33.5 కాసుల బం గారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి సా మాన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూలై 27న పట్టణంలో సత్యవతినగర్‌లో అనుమకొండ సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుని పోయారు.
ఈ కేసులో ప్రస్తుతం ఒడిశాలోని రాయగడ్‌లో ఉంటున్న పట్టణానికి చెందిన తిరువేదుల గణపతి (చోటూ) ప్రధాన నిందితుడిగా తేలిందన్నారు. అతనితో పాటు ఒడిశాలోని ఖరియారోడ్డు గ్రామానికి షేక్ ఇమ్రాన్ అలీ, రాయ్‌గడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటున్న గాడి అజయ్ (ఇమ్రాన్), ఉంగుటూరు మండలం బాదంపూడిలో నివాసం ఉంటున్న జార్జాని వీరవెంకట సత్యసాయి రామదుర్గాప్రసాద్ ముఠాగా చోరీలకు పాల్పడున్నట్టు గుర్తించామన్నారు. వీరు ఈనెల 11న కొవ్వూరు మొయిన్‌రోడ్డు గొల్లి త్రినాథరావు అనే వ్యక్తికి చెందిన బంగారు షాపులో రెండు జతల చెవిదిద్దులు దొంగిలించుకుని పోయారన్నారు. వీరి నుంచి రూ.7.83 లక్షల విలువైన చోరీ సొత్తుని రికవరీ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరుస్తామన్నారు.
ప్రధాన నిందితుడు గణపతికి ఇమ్రాన్, ఆజయ్ తల్లితో సాన్నిహిత్యం ఉందన్నారు. ఈ కారణంతోనే గణపతి ఒడిశా వెళ్లాడన్నారు. వీరిపై రాయగడ్, శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో పట్టణ సీఐ కె.విజ య్‌బాబు, క్రైం కంట్రోల్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎం.శ్యామ్‌సుందరరావు, పి.రవీంద్ర, ఏఎస్సై ఎ.కోట సత్యనారాయణతో పాటు ఇతర సిబ్బంది సహకరించారన్నారు. చోరీ కేసు ఛేదించిన సి బ్బందిని ఆయన అభినందించారు. జిల్లా ఎస్పీకి రివార్డుల నిమిత్తం సిఫార్సు చేస్తామని చెప్పారు. పట్టణ ఎస్సై జీజే విష్ణువర్ధన్, హెచ్‌సీ బి.బాబూరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment