సాక్షి, సికింద్రాబాద్: గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. నగరానికి వస్తున్న వాణి అనే ప్రయాణికురాలి వద్ద నుంచి గుర్తుతెలియని దుండగులు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీంతో బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ చోరీ జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment