
రియాద్ : సౌదీ అరేబియాలో ఓ మహిళా రచయిత రాసిన నవల వివాదాస్పదంగా మారింది. అశ్లీలత ఉందంటూ దానిని చదివినవారు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ నవలను ప్రభుత్వం రద్దు చేసి, కాపీలను వెనక్కి రప్పించింది.
బద్రియా అల్ బిష్ర్ మహిళల హక్కుల ఉద్యమకారిణి. రచయితగా తన పుస్తకాలకు గతంలో చాలా అవార్డులు గెలుచుకున్నారు కూడా. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ నవల రాశారు. ‘‘ఓ యువతి కొందరు మహిళల కష్టాలను తెలుసుకునేందుకు చేసే ప్రయాణం.. అందులో ఆమెకు ఎదురైన అనుభవాలతో’’ ఆ నవల కథ ఉంది. అయితే అందులో కొంత భాగం శృంగార నేపథ్యంతో కూడుకుని ఉందంట. కొందరు పాఠశాలు విషయాన్ని వెలుగులోకి తేగా.. మత పెద్దలు మండిపడ్డారు. దీనికి తోడు పెద్దలకు మాత్రమే గా పరిగణించాల్సిన ఈ నవలను చిన్న పిల్లల గ్యాలెరీలో పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ పుస్తకాన్ని వెనక్కి రప్పించి, విచారణకు ఆదేశించారు. కాగా, ఈ విమర్శలపై స్పందించేందుకు బిష్ర్ అందుబాటులో లేరు. చట్టాలు చాలా కఠినంగా ఉండే సౌదీలో పుస్తకాలు, మాగ్జైన్, జర్నల్స్ కూడా సెన్సార్ అవుతుంటాయి. మరి ఈమె నవల సెన్సార్ చేసుకోకుండానే మార్కెట్‌లోకి వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment