
సాక్షి, రావులపాలెం (కొత్తపేట): ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన ఒక ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌ను సినీ ఫక్కీలో చోరీ చేసిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రావులపాలెం ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి శివారు పోతుమట్టలకు చెందిన కటికదల విశ్వతేజ తన స్పోర్ట్స్ బైక్‌ను అమ్మతానని ఇటీవల ఓఎల్‌ఎక్స్ సైట్‌లో పెట్టాడు. ఇది చూసిన రాజమహేంద్రవరానికి చెందిన ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ కొంటానని ఆన్‌లైన్‌లోనే సంప్రదించాడు.
బైక్‌ను రావులపాలెం తీసుకురావాలని సూచించాడు. దీంతో శనివారం విశ్వతేజ బైక్‌తో రావులపాలెం వచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తి బైక్ ట్రయిల్ వేస్తానని చెప్పడంతో ఇద్దరు స్థానికంగా కొంత దూరం వెళ్లాక సమీపంలో తన భార్య ఉందని డబ్బులు తెస్తానని చెప్పడంతో విశ్వతేజ బైక్ దిగాడు. ఇదే అదనుగా ఆ వ్యక్తి బైక్‌తో ఉడాయించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్ విలువ రూ.1.75 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. దీనిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment