నీ వెంటే నేనూ.. | Twin Brothers Deceased With Heart Stroke in SPSR nellore | Sakshi
Sakshi News home page

నీ వెంటే నేనూ..

Published Tue, Jul 21 2020 1:26 PM | Last Updated on Tue, Jul 21 2020 1:26 PM

Twin Brothers Deceased With Heart Stroke in SPSR nellore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అనుమసముద్రంపేట: వారిద్దరూ కవలలు.. కలిసి పెరిగారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. తన కంటే ఏడు నిమిషాలు చిన్నవాడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అన్న మనోవేదనకు గురై అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో కుప్పకూలాడు. ఈ సంఘటన ఏఎస్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వేమన చందు, రమేష్‌లు కవలలు. ఇద్దరూ చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రమేష్‌ ఆదివారం రాత్రి శానిటైజర్‌ తాగి మృతిచెందాడు. ఈ విషయాన్ని చందు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం రమేష్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా చందు అక్కడ కుప్పకూలాడు. బంధువులు వెంటనే అతడిని ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మృతిచెందాడని తెలిపారు. ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో వారి తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement