ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జైపాల్, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవి
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరు ఎస్పీ కార్యాలయం ఎదుట, మరొకరు అటవీశాఖ కార్యాలయం ముందు పురుగుల మందు తాగారు. వారిద్దరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన ఎట్టెం జైపాల్‌కు ఎకరం భూమి ఉండగా.. నేమిళ్ల నారాయణ భూమి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఏడాదిగా వీరిమధ్య రహదారి వివాదం జరుగుతోంది. మంగళవారం మరోసారి గొడవ జరగగా.. జైపాల్‌పై నారా యణ దాడిచేశాడు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం ఎస్పీని కలిసేందుకు జైపాల్ వెళ్లి.. కార్యాలయం బయటే పురుగుల మందు తాగాడు. పోలీసులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ అనంతశర్మ అతడి నుంచి వివరాలు సేకరించారు.
కేసు పెట్టారని మరొకరు...
సారంగాపూర్ మండలం రేచపల్లి శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షాక్‌పెట్టి ఓ సాంబర్ అనే అటవీ జంతువును హతం చేశారు. అనంతరం దాని మాంసాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా.. అటవీశాఖ అధికారులు గమనించి అజ్మీరా రవి, సుబ్రహ్మణ్యంలను పట్టుకుని కేసు నమోదు చేశారు. బుధవారం కార్యాలయానికి తీసుకువచ్చారు. కోర్టులో హాజరు పరుస్తారనే భయంతో రవి వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగాడు. రవిని తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment