చంద సిద్దార్థ (ఫైల్)
రాయికల్(జగిత్యాల): మిషన్ భగీరథ పైప్‌లైన్‌కోసం తీసిన గుంతలు పూడ్చకపోవడంతో ప్రమాదం జరిగి యువకుడు మృతిచెందిన సంఘటన రాయికల్ పట్టణంలో విషాదం నింపింది. వివరాలు ఇలా..రాయికల్ పట్టణంలోని గ్రామ శివారులో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడంతో చంద సిద్దార్థ (19) అనే యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ఆరోగ్యం గురువారం తెలిపారు. పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన చంద సిద్దార్థ ఇంటి నుంచి రాయికల్ పట్టణానికి బైక్‌పై వెళ్తుండగా కిష్టంపేట గ్రామానికి చెందిన ఏలేటి రాజేశ్ రామాజీపేట గ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురెదుగా వాహనాలు ఢీకొనడంతో చంద సిద్దార్థ తలకు తీవ్రగాయాలుఅయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించినప్పటికీ సకాలంలో రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో జగిత్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన చోట మిషన్ భగీరథ పైప్‌లైన్‌కోసం గుంతలు తవ్వగా పూడ్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment