Bhagiratha pipeline
-
లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్
-
‘భగీరథ’ వ్యథ!
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మిషన్ భగీరథ లీకేజీల మయంగా మారింది. చాలా చోట్ల పైప్లైన్ లీకై నీరంతా వృథాగా పోతుంది. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పైప్లైన్లకు తరచు లీకేజీలు ఏర్పడుతుండడంతో నీరు కలుషితం అవుతుంది. లీకేజీలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి శుద్ధనీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ అధికారుల అలసత్వంతో ప్రజలకు శుద్ధనీరు అందడం లేదు. సదాశివనగర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో పైప్లైన్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని పాలకులు, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. వర్షకాలంలో పైప్లైన్లు లీకయితే బురదనీరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. లీకేజీల మరమ్మతులను సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల తరఫున మరమ్మతులు చేయిస్తే బిల్లుల చెల్లింపులు చేయమని అధికారులు స్పష్టం చేయడంతో భగీరథ ఆశయం నీరు గారిపోతోంది. చాలా గ్రామాల్లో రహదారి మధ్యలో పైప్లైన్ కోసం తవ్వకాలు చేపట్టి ఆ తర్వాత ఆ రోడ్డుకు మరమ్మతులు చేయలేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించే అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాల్సి ఉన్నా.. గ్రామాల్లో అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయా గ్రామాల సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లీకేజీలను అరికట్టి శుద్ధనీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన భగీరథ గుంత
రాయికల్(జగిత్యాల): మిషన్ భగీరథ పైప్లైన్కోసం తీసిన గుంతలు పూడ్చకపోవడంతో ప్రమాదం జరిగి యువకుడు మృతిచెందిన సంఘటన రాయికల్ పట్టణంలో విషాదం నింపింది. వివరాలు ఇలా..రాయికల్ పట్టణంలోని గ్రామ శివారులో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడంతో చంద సిద్దార్థ (19) అనే యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ఆరోగ్యం గురువారం తెలిపారు. పట్టణంలోని భరత్నగర్కు చెందిన చంద సిద్దార్థ ఇంటి నుంచి రాయికల్ పట్టణానికి బైక్పై వెళ్తుండగా కిష్టంపేట గ్రామానికి చెందిన ఏలేటి రాజేశ్ రామాజీపేట గ్రామానికి బైక్పై వస్తుండగా ఎదురెదుగా వాహనాలు ఢీకొనడంతో చంద సిద్దార్థ తలకు తీవ్రగాయాలుఅయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించినప్పటికీ సకాలంలో రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో జగిత్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన చోట మిషన్ భగీరథ పైప్లైన్కోసం గుంతలు తవ్వగా పూడ్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
పగిలిన ‘భగీరథ’ పైప్లైన్
వర్గల్: మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా వర్గల్ సత్యసారుు మందిరం సమీపంలో ప్రధాన రహదారిపై జరిగింది. ఒంటి గంట ప్రాంతంలో రోడ్డు కింద ఉన్న పైప్ లైన్ ధ్వంసమై భారీ లీకేజీ ఏర్పడింది. తారురోడ్డును బద్దలు చేస్తూ లీకేజీ నుంచి నీళ్లు ఎగసిపడ్డాయి. విద్యుత్ స్తంభం వైర్లు తాకుతూ నీళ్లు నింగికి ఎగిసాయి. దీంతో ముందుజాగ్రత్తగా ట్రాన్స్కో ఏఈ వేణుగోపాలాచార్యులు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ఘటన వల్ల సమీప గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి0ది.