పగిలిన ‘భగీరథ’ పైప్‌లైన్ | Bhagiratha pipeline has broken | Sakshi
Sakshi News home page

పగిలిన ‘భగీరథ’ పైప్‌లైన్

Published Thu, Oct 6 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

పగిలిన ‘భగీరథ’ పైప్‌లైన్

పగిలిన ‘భగీరథ’ పైప్‌లైన్

వర్గల్: మిషన్  భగీరథ పైప్‌లైన్ పగిలింది. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా వర్గల్ సత్యసారుు మందిరం సమీపంలో ప్రధాన రహదారిపై జరిగింది. ఒంటి గంట ప్రాంతంలో రోడ్డు కింద ఉన్న పైప్ లైన్  ధ్వంసమై భారీ లీకేజీ ఏర్పడింది. తారురోడ్డును బద్దలు చేస్తూ లీకేజీ నుంచి నీళ్లు ఎగసిపడ్డాయి.

విద్యుత్ స్తంభం వైర్లు తాకుతూ నీళ్లు నింగికి ఎగిసాయి. దీంతో ముందుజాగ్రత్తగా ట్రాన్స్‌కో ఏఈ వేణుగోపాలాచార్యులు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఇదే పరిస్థితి కొనసాగింది.  ఈ ఘటన వల్ల సమీప గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి0ది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement