సౌదీలో ఘనంగా 'తాజ్' మాట ముచ్చట | telugu association of jeddah celebrates Mata muchata | Sakshi
Sakshi News home page

సౌదీలో 'తాజ్' ఘనంగా మాట ముచ్చట

Published Mon, Dec 30 2013 10:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

సౌదీలో ఘనంగా  'తాజ్'  మాట ముచ్చట

సౌదీలో ఘనంగా 'తాజ్' మాట ముచ్చట

ఓ వైపు రాష్ట్రం విభజన సెగతో ఉడికిపోతుంటే మరోవైపు ప్రవాసాంధ్రులు మాత్రం ప్రాంతాలకు అతీతంగా వేడుకలు జరుపుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని జెద్ధాలో ప్రవాసాంధ్రుల సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్ధా (తాజ్) ఆధ్వర్యంలో జరిగిన మాట ముచ్చట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యాన్బూ, మదీనా, రాబిఖ్, అల్ లీత్, మక్కాలలో నివసించే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తాజ్ అధ్యక్షుడు మస్తాన్ షేక్ ...తాజ్ ఆవిర్భావ ఆవశ్యకతను వివరించగా, ప్రధాన కార్యదర్శి కుటుంబరావు సంఘం ఉద్దేశాలను వివరించారు.  మహిళ విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, మహ్మద్ ఇమ్రాన్, రాంబాబు, సయ్యద్ మెయిజ్, ఇందిర, భారతీలు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో  అంజాద్ హుస్సేన్ బేగ్ పాడిన పాటలు ప్రసీత మనోజ్ చేసిన కూచిపూడి నృత్యం, విజయలక్ష్మి, రామసీతలు పాడిన గేయాలు ఆహుతుల్ని అలరించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement