
సిడ్నీ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ (ఏటీఎస్) ఆధ్వర్యంలో సిడ్నీలో చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. వినాయక ప్రతిమను ప్రతిష్టించి బొజ్జ గణపయ్యకు నిత్య పూజలందిస్తున్నారు. గణపయ్యను చిన్నారులు, పెద్దలు సందడితో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఏటీఎస్ ప్రతినిధులు, ఆస్ట్రేలియాలోని తెలంగాణ వారందరూ పాల్గొన్నారు.