మిర్యాలగూడను జిల్లా చేయాలి
Published Tue, Nov 22 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
మిర్యాలగూడ: మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిర్యాలగూడ జిల్లా సాధన కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిర్యాలగూడ జిల్లా సాధనకు ఉద్యమ కార్యచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసినట్లు చెప్పారు.
కాగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల వల్ల సీఎం కేసీఆర్ వద్దకు జిల్లా డిమాండ్ అంశం చేరిందన్నారు. జిల్లా సాధించే వరకు ఉద్యమాలు చేపట్టాలని కమిటీ నిర్ణయించినట్లు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు వివరించారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలంతా మిర్యాలగూడ జిల్లా కావాలని కోరుకుంటున్నారని, అదే విధంగా హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బంటు వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, టీపీసీసీ సభ్యుడు పగిడి రామలింగయ్య, స్కైలాబ్‌నాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ యూసుఫ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, చిరుమర్రి కృష్ణయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు సైదులు, పట్టణ కార్యదర్శి జగదీశ్‌చంద్ర, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు, కరీం, సమీఖాద్రి పాల్గొన్నారు.
Advertisement