
సాక్షి, తిరుపతి : ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో కిలో రూ. 45 గల బియ్యాన్ని రైస్ మిల్లర్లు టీటీడీకి రూ.38 కు అందిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రోజు సమీక్ష అనంతరం కిలో బియ్యం ధరను మరో రూపాయి తగ్గించినట్లు వెల్లడించారు. దీంతో టీటీడీకి 3 నెలలకు 15 లక్షల రూపాయలు ఆదా అవుతుందన్నారు. ఇంత వరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తునట్లు తెలిపిన ధర్మారెడ్డి.. బియ్యం కొనుగోలును దశల వారిగా తగ్గించి విరాళాలు పెంచాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ను కోరారు. ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీవారి అన్నప్రసాదం కు 375 క్వింటాల బియ్యాన్ని విరాళంగా అందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment