అనంతపురం అగ్రికల్చర్ : సెక్స్‌డ్ సెమన్‌తో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తే వంద శాతం పెయ్య దూడలు పుడతాయని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి తెలిపారు. మొదటిసారిగా రెండు రోజుల కిందట జిల్లాకు 240 డోసుల సెక్స్‌డ్ సెమన్ సరఫరా అయిందన్నారు. ఒక్క డోసు పూర్తీ విలువ రూ.1,000 కాగా ఇందులో రైతులు తమ వాటాగా రూ.250 చెల్లిస్తే పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుందన్నారు.
దీని వల్ల కచ్చితంగా చూడి (గర్భం) నిలవడమే కాకుండా 100 శాతం పెయ్య (ఆడ) దూడలు పుడతాయని తెలిపారు. మేలుజాతికి చెందిన హెచ్‌ఎఫ్, జెర్సీ రకాల నుంచి సేకరించిన వీర్యాన్నే సెక్స్‌డ్ సెమన్‌గా పిలుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆవులకు మాత్రమే సెక్స్‌డ్ సెమన్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. డీఎల్‌డీఏ కార్యాలయం, గోపాలమిత్రలను సంప్రదించి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు.
సెక్స్‌డ్ సెమన్‌తో వంద శాతం పెయ్యలు
Published Sun, Jun 25 2017 11:17 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement