120 కేజీల గంజాయి పట్టివేత
Published Wed, Jul 27 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
ఏలూరు అర్బన్ : విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 120 కిలోల గంజాయిని పట్టుకుని ముగ్గురు నిందితులను ఎకై ్సజ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ ౖవై.బి.భాస్కరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్, బి.శ్రీలత ఎన్‌ఫోర్స్‌మెంట్ సర్కిల్ సీఐ, ఎం.శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి చెన్నై– కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిపై హనుమాన్ జంక్షన్ సమీపంలోని కలపర్రు టోల్‌గేట్ వద్ద మాటు వేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఏపీ 31, సీవై 6605 నంబరు గల కారును ఆపి తనిఖీ చేయగా. అందులో 120 కిలోల గంజాయి లభ్యమైంది. దీనిని తీసుకెళ్తున్న విశాఖపట్నం, బయ్యలపూడి, వడ్డెప్పగూడెం, బుచ్చియ్యపేట గ్రామాలకు చెందిన గాడి శ్రీను, ఉలిసి తాతాజీ, సీరా జల్లిబాబును అరెస్ట్ చేశారు. స్వాధీన ం చేసుకున్న గంజాయి విలువ రూ.3,60,000 వరకూ ఉంటుందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీసీ భాస్కరరావు తెలిపారు. సమావేశంలో ఏలూరు ఎకై ్సజ్ సీఐ కె.వి.ఎస్. కళ్యాణ చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement