on nh
-
తప్పిన ప్రమాదం..మోటార్ సైకిల్ తునాతునాకులు
నారాయణపురం(ఉంగుటూరు) : జాతీయరహదారి నారాయణపురం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మోటార్ సైకిల్ తునాతునకలైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాచూరుకు చెందినబొడ్డు వెంకట అప్పరెడ్డి మోటార్ సైకిల్‌పై పెట్రోల్ బంకుకు వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అప్పిరెడ్డి తప్పించుకోగా మోటార్ సైకిల్ తునాతునకలైంది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంట బోదెలోకి దూసుకెళ్లిన లారీ
నల్లాకులవారిపాలెం(పెరవలి) : వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లింది. ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం నుంచి తణుకువైపు వస్తున్న లారీ నల్లాకులవారిపాలెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తుండగా, ఎదురుగా రాంగ్రూట్లో వచ్చిన మరో వ్యాన్ కటింగ్ వద్ద హఠాత్తుగా మలుపు తిరిగింది. దీంతో ఒక్కసారిగా వేగాన్ని లారీ డ్రై వర్ నియంత్రించలేకపోయాడు. ఫలితంగా అది పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకెళ్లింది. లారీని బోదెలోకి మళ్లించకపోతే లారీ మనుషులపై నుంచి వెళ్లిపోయేదని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారి వివరాలు తెలియరాలేదు. -
120 కేజీల గంజాయి పట్టివేత
ఏలూరు అర్బన్ : విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 120 కిలోల గంజాయిని పట్టుకుని ముగ్గురు నిందితులను ఎకై ్సజ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ ౖవై.బి.భాస్కరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్, బి.శ్రీలత ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ సీఐ, ఎం.శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి చెన్నై– కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిపై హనుమాన్ జంక్షన్ సమీపంలోని కలపర్రు టోల్గేట్ వద్ద మాటు వేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఏపీ 31, సీవై 6605 నంబరు గల కారును ఆపి తనిఖీ చేయగా. అందులో 120 కిలోల గంజాయి లభ్యమైంది. దీనిని తీసుకెళ్తున్న విశాఖపట్నం, బయ్యలపూడి, వడ్డెప్పగూడెం, బుచ్చియ్యపేట గ్రామాలకు చెందిన గాడి శ్రీను, ఉలిసి తాతాజీ, సీరా జల్లిబాబును అరెస్ట్ చేశారు. స్వాధీన ం చేసుకున్న గంజాయి విలువ రూ.3,60,000 వరకూ ఉంటుందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీసీ భాస్కరరావు తెలిపారు. సమావేశంలో ఏలూరు ఎకై ్సజ్ సీఐ కె.వి.ఎస్. కళ్యాణ చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు.