సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్‌శాఖ 138 మంది హోంగార్డులను డిప్యుటేషన్‌పై పంపింది. తెలంగాణకు నాలుగు వైపులా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటకల సరిహద్దుల నుంచి వచ్చే వాహనాల తనిఖీకి 12 చెక్‌పోస్టులు ఉన్నాయి.
అయితే సిబ్బంది కొరత కారణంగా చెక్‌పోస్టులు నామమాత్రంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ డీజీపీ 138 మందిని డిప్యుటేషన్ మీద పంపించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
138 మంది హోంగార్డుల డిప్యుటేషన్
Published Sat, Aug 8 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement
Advertisement