13న అండర్–16 బాలికల క్రికెట్ జట్టు ఎంపిక
Published Thu, Aug 11 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
అనంతపురం సప్తగిరి సర్కిల్ :
ఈ నెల 13న అండర్–16 బాలికల క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. కడపలో ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే అండర్–16 బాలికల అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జిల్లా జట్టుకు 13న ఉదయం 9 గంటలకు అనంత క్రీడాగ్రామంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు.
సెప్టెంబర్ 1, 2000 సంవత్సరంలోపు పుట్టిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారిణులు యూనిఫాంతో హాజరుకావాలన్నారు.
Advertisement
Advertisement