19 మంది క్రీడాకారుల ఎంపిక
Published Mon, Nov 7 2016 11:59 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్:
ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ సెలెక్సన్స్ జిల్లా నుంచి 19 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. జిల్లాలో జూలైలో నిర్వహించిన సెలెక్సన్స్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, సెకండ్ ఫేస్ మంగళగిరిలో జరిగే సెలెక్సన్స్లో రాణించిన వారికి ఆంధ్రా అకాడమీలో చోటు దక్కుతుందన్నారు.
అక్కడ అండర్–14కు ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 12 వరకు అండర్–16కు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14న, అండర్–19కు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18న హాజరు కావాల్సి ఉందన్నారు. అండర్–23 ఎంపికైన క్రీడాకారులు కూడా ఈ నెల 19న హాజరుకావాలన్నారు.
ఎంపిౖకెన క్రీడాకారుల వివరాలు:
అండర్–14 విభాగం
అనీష్‌వీరారెడ్డి, భార్గవ్, విఘ్నేష్, శ్రీనివాసులు, మహీర్, భాస్కర్, మురళీ, లోహిత్‌సాయి, గణేష్‌రెడ్డి, భానుప్రకాష్, ప్రశాంత్
అండర్–16 విభాగం
విష్ణువర్ధన్, నబిరసూల్, నరేష్, పవన్ కళ్యాణ్, చంద్రమౌళి
అండర్–19 విభాగం
శివగణేష్, సాయికుమార్, జగన్మోహన్ రెడ్డి
Advertisement
Advertisement