రైల్వేకు రూ.14.5 కోట్ల ఆదాయం
విజయవాడ (రైల్వే స్టేషన్ ) :
పుష్కర యాత్రికుల ద్వారా రైల్వే శాఖకు ఇప్పటివరకు రూ.14.5 కోట్ల ఆదాయం లభించిందని దక్షిణ మధ్య రైల్వే పుష్కరాల ప్రత్యేకాధికారి పి.రమేష్‌బాబు తెలిపారు. ఆదివారం పుష్కర కంట్రోల్‌రూంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఆదాయం సాధారణ, రిజర్వుడు టికెట్లు ద్వారా లభించిందన్నారు. పుష్కరాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు 10.38 లక్షల మంది యాత్రికులు రాకపోకలు సాగించారని చెప్పారు. వివిధ ప్రాంతాలకు ప్రతి రోజూ 39 పుష్కర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. రైల్వేస్టేçÙన్‌లో 1250 ఆర్పీఎఫ్, 1400 మంది జీఆర్పీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారని, నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.
రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పరిశీలన
రైల్వేస్టేçÙన్‌లో యాత్రికుల భద్రతను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ జీఎం ఈశ్వరరావు ఆదివారం పరిశీలించారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్‌ఆర్ గాంధీ, ఆర్పీఎఫ్ సీఐ కర్నాటి చక్రవర్తి ఆయన వెంట ఉన్నారు.