14న బీఈడీ, డిగ్రీ ప్రవేశ పరీక్షలు
Published Fri, Aug 12 2016 7:04 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ, బీఈడీ (స్పెషల్), డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీలో ప్రవేశం కోసం ఈనెల 14న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు ఆ యూనివర్సిటీ సీఆర్‌ఆర్ కళాశాల స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బీఈడీ, డిగ్రీ ప్రవేశపరీక్ష జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్) ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఎఓయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు.
Advertisement
Advertisement