గుంటూరు : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులోని పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 18 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పేకాటరాయుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట రాయుళ్లు అరెస్ట్: రూ. 80 వేలు సీజ్
Published Thu, Sep 10 2015 12:16 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement