17నుంచి తెలంగాణలో రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్ | 17 in the second phase of the Telangana PG Medical Counseling | Sakshi
Sakshi News home page

17నుంచి తెలంగాణలో రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్

Published Sun, May 15 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

17నుంచి తెలంగాణలో రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్

17నుంచి తెలంగాణలో రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి  నాన్ సర్వీస్ అభ్యర్థులకు ఈనెల 17,18 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. అదేవిధంగా సర్వీస్ అభ్యర్థులకు ఈనెల 18న కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు.

ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ సెంటర్లకు హాజరుకావాలని పేర్కొన్నారు. మిగిలిన వారు వెబ్‌ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ లేదా హెచ్‌టీటీపీ://టీఎస్‌పీజీఎంఈడీ.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏసీ.ఇన్) వెబ్‌సైట్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement