లైంగికదాడికి యత్నించిన ఇద్దరి అరెస్ట్‌ | 2 persons arrested for sexual harassement | Sakshi
Sakshi News home page

లైంగికదాడికి యత్నించిన ఇద్దరి అరెస్ట్‌

Published Wed, Aug 24 2016 12:20 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

2 persons arrested for sexual harassement

నల్లబెల్లి : నర్సంపేట డివిజన్‌లో వేర్వేరు చోట్ల మహిళలపై లైంగిక దాడికి యత్నించిన ఇద్దరి ని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. నల్లబెల్లి ఎస్సై మేరుగు రాజమౌళి కథనం ప్రకారం... మండలంలోని లెంకాలపల్లి గ్రా మానికి చెందిన ఓ వివాహిత అదే మండలంలోని నందిగామలోని తమ సోదరులకు రాఖీ లు కట్టేందుకు వెళ్లి పుట్టింట్లో ఉంది. రేలకుం టకు చెందిన మూడు భాస్కర్‌ ఆదివారం మొబైల్‌ చార్జర్‌ కోసం ఇంట్లోకి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి య త్నించాడు. ఆమె అరవడంతో భాస్కర్‌ పారి పోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. 
దుగ్గొండిలో.. 
దుగ్గొండి : వివాహితæపై లైంగిక దాడికి య త్నించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏఎస్సై రఫాయిల్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని నారాయణతండా గ్రామానికి చెంది న ఓ మహిళ ఈ నెల 16న రాత్రి ఒంటరిగా ఉ న్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన కొర్ర రాజేందర్‌ ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో ఆమె భర్త, ఇరుగుపొరుగు వారు వచ్చారు. దీంతో నిందితుడు పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రాజేందర్‌ను అరెస్టు చేసి నర్సంపేట మున్సిఫ్‌ మెజిస్ట్రీట్‌ కోర్టులో హాజరుపరిచినట్లు ఏఎస్సై వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement