- రహదారుల అభివృద్ధి సంస్థ డీఈ ప్రభాకర్
- తొలగింపుపై సూర్యారావుపేటలో సర్వే
రోడ్డు విస్తరణకు 276 గృహాలు తొలగించాలి
Published Wed, Aug 3 2016 12:03 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM
కాకినాడ రూరల్ :
కాకినాడ పోర్టు– సామర్లకోట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్న క్రమంలో 276 గృహాలను తొలగించాల్సి వస్తోందని రహదారుల అభివృద్ధి సంస్థ డీఈ ప్రభాకర్ వెల్లడించారు. వీటిలో 99 గృహాలను పూర్తిగాను, 176 గృహాలను పాక్షికంగా తొలగించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులతో పాటు వివిధ ఆలయాలు కలిపి 37 తొలగించాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట పంచాయతీలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. మొత్తం 27.5 కిలోమీటర్ల పొడవునా ప్రస్తుతం ఉన్న రోడ్డు మధ్య నుంచి రెండువైపులా 20 మీటర్ల చొప్పున 40 మీటర్ల మేర రోడ్డును విస్తరిస్తామని ప్రభాకర్ వివరించారు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి పథకంలో భాగంగా ఈ రోడ్డును విస్తరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సూర్యారావుపేట సర్పంచ్ యజ్జల బాబ్జీ, హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ నిపుణుడు ఎ మాధవరెడ్డి, అలాగే సి దేవరాజ్‌లతో పాటు గ్రామపెద్దలు, స్థానిక నిర్వాసితులు పాల్గొన్నారు.
Advertisement