బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్న 31 మంది విద్యార్థులకు వెస్ట్‌లైన్ షిప్ మేనేజ్‌మెంట్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇటీవల ఎస్‌ఆర్‌ఐటీలో వెస్ట్‌లైన్ షిప్ కంపెనీ ప్రతినిధులు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. రాత పరీక్షలో 123 మంది పాల్గొనగా వీరిలో 62 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.
ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన 31 మంది ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్, నావిగేషన్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రంజిత్‌రెడ్డి అభినందించారు.
ఎస్‌ఆర్‌ఐటీలో 31మందికి ఉద్యోగావకాశాలు
Published Thu, Mar 23 2017 12:09 AM | Last Updated on Wed, Sep 5 2018 4:23 PM
Advertisement
Advertisement