srit
-
ఎస్‌ఆర్‌ఐటీకి న్యాక్ గుర్తింపు
శింగనమల: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆగస్టు 21, 22, 23 తేదీల్లో కేంద్ర బృందం కళాశాలలో సౌకర్యాలు, విద్య, వసతులను పరిశీలించారన్నారు. అదేవిధంగా విద్యార్థులకు లభించిన ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారన్నారు. అదే నెల 27న బెంగళూరులో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్‌ను ప్రకటించారన్నారు. కళాశాలను స్థాపించిన పదేళ్లలోనే ఇంతటి ఘనత సాధించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ విజయం సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. జిల్లాలో ఏకైన న్యాక్ ఏ–గ్రేడు గుర్తింపు కళాశాల సీఈఓ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని 300 ఇంజినీరింగ్ కళాశాలలో 50 కళాశాలలకు న్యాక్ అక్రిడిటేషన్ ఉందన్నారు. అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో 110 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా.. వీటిలో 20 కళాశాలకు న్యాక్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించిందన్నారు. ఇందులో 7 కళాశాలలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉండగా.. వీటిలో ఎస్‌ఆర్‌ఐటీకి కూడా చోటు దక్కిందన్నారు. జిల్లా విషయానికొస్తే న్యాక్ ఏ గ్రేడ్ కలిగిన ఏకైక ఇంజినీరింగ్ కళాశాల ఎస్ఆర్ఐటీ మాత్రమేనన్నారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో తమ కళాశాల ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంబీఏ అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఆరు నెలల్లో మరో అరుదైన గుర్తింపు తమ కళాశాల సొంతమవుతుందన్నారు. ఏడాదికి 150 మందికి ఉద్యోగాలు వివిధ రాష్ట్రాల్లోని అత్యున్నత సాఫ్ట్వేర్ కంపెనీల్లో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల టీపీఓ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఏడాదిలో 150 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. రీసెర్చ్‌లపై ప్రేత్యక దృష్టి సారించి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. -
రేపు ఎస్‌ఆర్‌ఐటీలో క్యాంపస్ డ్రైవ్
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కశాలలో ఈ నెల 5వ తేదీ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వారు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌కు ఈఈఈ, మెకానికల్ విభాగాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించిన పాలిటెక్నికల్ విద్యార్థులు అర్హులన్నారు. పాల్గొనదలచినవారు తమ రెజూం, మార్కుల జాబితాలు తీసుకుని ఉదయం 9 గంటలకు ఎస్ఆర్ఐటీ కళాశాలకు రావాలన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.1.20 - 1.50 లక్షలు వేతనం ఉంటుందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వైఎస్సార్ జిల్లాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 95052 83026, 95052 83037 నెంబర్లలో సంప్రదించి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
ఎస్‌ఆర్‌ఐటీలో 31మందికి ఉద్యోగావకాశాలు
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్న 31 మంది విద్యార్థులకు వెస్ట్‌లైన్ షిప్ మేనేజ్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇటీవల ఎస్‌ఆర్‌ఐటీలో వెస్ట్‌లైన్ షిప్ కంపెనీ ప్రతినిధులు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. రాత పరీక్షలో 123 మంది పాల్గొనగా వీరిలో 62 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన 31 మంది ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, నావిగేషన్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రంజిత్‌రెడ్డి అభినందించారు. -
మినీ హెలికాప్టర్ తయారు చేసిన బీటెక్ స్టూడెంట్స్
-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఎస్ఆర్ఐటీ కళాశాల తొమ్మిదో వార్షికోత్సవం బుక్కరాయసముద్రం : రోటరీపురం సమీపాన గల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ) కళాశాల తొమ్మిదో వార్షికోత్సవం శనివారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. శ్రీసాయిబాబా నేషనల్ (ఎస్ఎస్బీఎన్) డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, సినీ నటి ప్రణీత, ఎస్ఆర్ఐటీ కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, సీఇఓ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆడిపాడారు. సినీనటి ప్రణీత విద్యార్థులను ప్రోత్సహించడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వివిధ బ్రాంచ్‌లలో కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. మరింత బాగా చదువుకోవాలంటూ ముఖ్య అతిథులు ప్రోత్సహించారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక్క యువతతోనే సాధ్యమన్నారు. విద్యార్థుల స్వాగతంతో ఎనర్జీ అనంతపురం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సినీ నటి ప్రణీత అన్నారు. చాలా మంది విద్యార్థులు శుక్రవారం నుంచే ఫేస్బుక్లో తనకు స్వాగతం పలకడం సంతోషాన్ని, చాలా ఎనర్జీని ఇచ్చిందన్నారు. ఎస్ఆర్ఐటీ కళాశాలలో 60 శాతం మందికి పైగా విద్యార్థినులు చదువుకుంటుండటం హర్షనీయమన్నారు. -
ప్రతిభా నైపుణ్యాలు అవసరం
ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి బుక్కరాయసముద్రం: విద్యార్థులకు ప్రతిభా నైపుణ్యాలు ఎంతో అవసరమని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఇంటెలిజెస టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్ర«థమ, ద్వితీయ సంత్సరం చదువుతున్న 1924 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలైనవారికి ఈ నెల 22న శ్రీనివాస రామానుజ¯ŒS జయంతిని పురస్కరించుకుని బహుమతులు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి బహుమతిగా ల్యాప్‌టాప్, ద్వితీయ బహుమతిగా 10 ఇ¯న్చెస్ ట్యాబ్లెట్, తృతీయ బహుమతిగా 7 ఇంచుల ట్యాబ్లెట్ ప్రదానం చేస్తామన్నారు. వీటితో పాటు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఏఓ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, నిజాం భాషా, అద్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
బుక్కరాయసముద్రం : మండల పరి«ధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఆ ధ్వర్యంలో ఉత్సాహంగా ఫ్రె షర్స్‌డే శనివారం నిర్వహిం చా రు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ జగన్మోహన్రెడ్డి హాజ రయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు సీనియర్, జూని యర్ అనే భేదాలు లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. విషయ పరిజ్ఞానాన్ని ఒకరినొకరు పంచుకొని నివృత్తి చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చదువుతోపాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి, డాక్టర్ జమీల్ బాషా, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.