బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరురోడ్డులోని బైపాస్‌రోడ్డు సమీపంలో సోమవారం తెల్లవారుజామున లారీలో తరలివెళుతున్న 334 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామాంజినాయక్ తెలిపారు. తెల్లవారుజామున అర్బన్ ఎస్‌ఐ చలపతితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా కరటంపాడు నుంచి అనంతపురం జిల్లా హిందూపురానికి వెళుతున్న ఓ లారీని ఆపి తనిఖీ చేశారు. అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు అనుమానం రావడంతో లారీని స్టేషన్‌కు తరలించారు., అనంతరం గోపవరం రెవెన్యూ అధికారులకు లారీని అప్పగించినట్లు ఆయన తెలిపారు.