అన్ని మండల కేంద్రాల్లో 3జీ సేవలు | 3g services in all mandal head quarters | Sakshi
Sakshi News home page

అన్ని మండల కేంద్రాల్లో 3జీ సేవలు

Published Thu, Sep 15 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

3g services in all mandal head quarters

హిందూపురం టౌన్‌ : జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు 3జీ సేవలు అందిస్తున్నట్లు కదిరి, హిందూపురం డివిజనల్‌ డీఈ బాలయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాలానుగుణంగా 3జీ సేవలను ఈ నెల 8 నుంచే అందుబాటులోకి తెచ్చామన్నారు.

అదేవిధంగా ఇంటర్‌నెట్‌ డేటా కోసం ప్రత్యేక ఆఫర్లు విడుదల చేశామని చెప్పారు. ఈ నెల 22న ఉచిత సిమ్‌ మేళాను జిల్లా మొత్తం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్‌డీఈ లక్ష్మీనారాయణ, జేటీఓలు రమేష్, మౌలాలి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement