జగమర్ల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డా. సుదర్శన్.
ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డా. సుదర్శన్
పలమనేరు : రాష్ట్రీయ బాల్ స్వస్థా కార్యక్రమ్ (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాకు 40 సంచార వైద్యవాహనాలు వచ్చాయని ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ తెలిపారు. పలమనేరు మండలంలోని జగమర్ల, దేవళంపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఆయన తనిఖీ చేశారు.జగమర్ల పాఠశాలలో ఇద్దరు చిన్నారులు జ్వరంతో బాధపడుతుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్‌కు సమాచారం అందించి వెంటనే వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌బీఎస్‌కే ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు ఈ కార్యక్రమం ద్వారా అందుతాయన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మన జిల్లాకు 126 మంది సిబ్బందిని కేటాయించిందని, వీరికి ఈ నెల 24 నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. వచ్చే నెల మొదటి వారం నుంచి జిల్లాలో సంచార వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.