sudarsan
-
GT Vs PBKS: పంజాబ్ తొలి పంచ్
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ పంజా విసిరింది. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య మెరుపులు... చివర్లో శశాంక్ సింగ్ ఫినిషింగ్ టచ్... ఇన్నింగ్స్ ఆసాంతం శ్రేయస్ అయ్యర్ దూకుడు... వెరసి పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో తగ్గేదేలే అన్నట్లు బాదిన గుజరాత్ చివరకు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోగా... ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ సిక్సర్లతో రెచ్చిపోగా... శశాంక్, ప్రియాంశ్ ఆర్య బౌండరీల మోత మోగించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఇన్నింగ్స్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 28 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో ప్రియాంశ్ దూకుడు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన ప్రియాంశ్... సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 6, 4 బాదాడు. అయ్యర్ వచ్చిరాగానే 4, 6తో చాంపియన్స్ ట్రోఫీ ఫామ్ కొనసాగించగా... ఐదో ఓవర్లో ప్రియాంశ్ 4, 4, 6, 4 కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 73/1తో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు కాస్త ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక మందగించగా... సాయికిషోర్ వరుస బంతుల్లో అజ్మతుల్లా (16), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే మ్యాక్స్‌వెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రివ్యూలో బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. 2 రివ్యూలు ఉన్నా పంజాబ్ సరైన సమయంలో వినియోగించుకోలేక స్టార్ బ్యాటర్ వికెట్ కోల్పోయింది. అవన్నీ మరిపించేలా అయ్యర్, శశాంక్ ఆఖర్లో బౌండరీలతో రెచ్చిపోయారు. సాయికిషోర్ ఓవర్లో 2 సిక్సర్లు బాదిన శ్రేయస్... రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు కొట్టాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టొయినిస్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా సాయికిషోర్‌కు వికెట్ సమర్పించుకోగా... ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో శ్రేయస్ 6, 4, 6, 6 కొట్టి 90 పరుగుల మీదకు చేరాడు. మరో 3 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఐపీఎల్లో అయ్యర్ తొలి సెంచరీ ఖాయమే అనుకుంటే... ఆఖర్లో అతడికి ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 18వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన శశాంక్ సింగ్.. చివరి ఓవర్లో 5 ఫోర్లు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో చిత్తు... భారీ లక్ష్యం కళ్లెదురుగా ఉన్నా... గుజరాత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నాలుగో ఓవర్లో గిల్ 6, 6, 4తో మోత ప్రారంభించగా... సుదర్శన్ దాన్ని కొనసాగించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బంతి తన పరిధిలో ఉంటే దానిపై విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో గిల్ వెనుదిరగగా... బట్లర్ చక్కటి షాట్లతో అలరించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 104/1తో నిలిచింది. ఈ క్రమంలో సుదర్శన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్‌లు కొట్టగా... తదుపరి ఓవర్లో సుదర్శన్ 4, 6, 4 బాదాడు. సుదర్శన్ ఔటయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ కూడా అలరించాడు. చివర్లో వైశాఖ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... లక్ష్యంవైపు సజావుగా సాగుతున్న గుజరాత్ ఒక్కసారిగా వెనుకబడింది. చివరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ 47; ప్రభ్‌సిమ్రన్ (సి) అర్షద్ (బి) రబడ 5; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 97; అజ్మతుల్లా (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 16; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) సాయికిషోర్ 0; స్టొయినిస్ (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 20; శశాంక్ సింగ్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–28, 2–79, 3–105, 4–105, 5–162. బౌలింగ్: సిరాజ్ 4–0– 54–0; రబడ 4–0–41–1; అర్షద్ 1–0–21 –0; రషీద్ 4–0–48–1; ప్రసిధ్ కృష్ణ 3–0–41–0; సాయికిషోర్ 4–0–30–3.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 74; గిల్ (సి) ప్రియాంశ్ (బి) మ్యాక్స్‌వెల్ 33; బట్లర్ (బి) యాన్సెన్ 54; రూథర్‌ఫర్డ్ (బి) అర్ష్ దీప్ 46; తెవాటియా (రనౌట్) 6; షారుక్ (నాటౌట్) 6; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 232. వికెట్ల పతనం: 1–61, 2–145, 3–199, 4–217, 5–225, బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–36–2; అజ్మతుల్లా 2–0–29–0; యాన్సెన్ 4–0–44–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–1; స్టొయినిస్ 2–0–31–0; చహల్ 3–0–34–0; వైశాఖ్ 3–0–28–0. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X కోల్‌కతావేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సువాలి
సువాలి కనబడక నాలుగు రోజులు కావస్తోంది. పోలీసులకు కంప్లెయింట్ ఇద్దామని తమ్ముడు ధరంసింగ్‌ను సలహా అడిగాడు హీరాలాల్. ‘‘ఎందుకన్నయ్యా.. పెనంలో పేలి పొయ్యిలో పడ్డట్టు.. పోలీసులు మనల్ని అందరినీ లోపలేసి వాయకొడతారే తప్ప ఫలితముండదు. మరో రెండు రోజులు చూద్దాం.. వదినమ్మను వెదికి తీసుకు వచ్చే పూచీ నాది. నువ్వేం కంగారుపడకు’’ అంటూ భరోసా ఇచ్చాడు ధరంసింగ్. ‘తమ్ముడు చదువుకున్న వాడు.. వాడి సలహా వినాల్సిందే..’ అని మనసులో అనుకున్నాడు హీరాలాల్. మరో రెండు రోజులు చూశాడు. అత్తమామల ఆవేదన భరించలేకపోయాడు. అల్లుడిపై అనుమానంతో, ములుగు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాళ్లు. ఎస్సై శంకర్ తన ప్రొబేషనరీ కాలం పూర్తయ్యాక ములుగు పోలీసు స్టేషన్లో ప్రథమంగా చేరాడు. సువాలి కనిపించకుండా పోయిన విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. కొత్తగా సర్వీసులో చేరిన వారికి ఇలాంటి పిచ్చి ఉండక మానదని మిగతా పోలీసులంతా నవ్వుకున్నారు. శంకర్ పట్టువదలని విక్రమార్కునిలా పరిశోధనకు ప్రణాళికలు వేసుకున్నాడు. అందులో భాగంగా ముందుగా హీరాలాల్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాడు. హీరాలాల్ ఉండేది మద్దనపల్లిలో. అది ములుగుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రోజు సువాలి తన ఆడపడుచుతో కలిసి షాపింగ్ కోసం ములుగుకు వెళ్లిందని తన ఎంక్వైరీలో తెలిసింది. ఆడపడుచును ఆరా తీయగా.. దారి మధ్యలోనే సువాలి తనకు కాస్త పని ఉందని దవాఖానా రోడ్డులో వెళ్లిందని, తనను షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్లమని కొంత డబ్బు ఇచ్చిందని చెప్పింది ఆ ఆడపడుచు. ఆ మరునాడు ఎస్సై శంకర్ డాక్టరు అనుమతి తీసుకొని హాస్పిటల్లో ఔట్ పేషెంట్ల వివరాల జాబితాను, అడ్మిట్ చేసుకునే వారి జాబితాను రిజిస్టర్లో వెతికాడు. సువాలి పేరు ఎక్కడా నమోదై లేదు. ఇంతలో హాస్పిటల్ ఫోన్ మోగింది. నర్స్ ఫోన్ ఎత్తి మాట్లాడుతోంది.. వెంటనే ఎస్సై శంకర్ మదిలో టెలిఫోన్ ఎక్సే్చంజ్ మెరిసింది. హాస్పిటల్ రోడ్డులోనున్న టెలిఫోన్ ఎక్సే్చంజ్‌కు వెళ్లాడు. అప్పట్లో టెలిఫోన్ ఆపరేటర్ మాత్రమే కాల్స్ కనెక్ట్ చేసేవాడు. అతనికి ప్రజలు మాట్లాడుకునే మాటలు అబ్జర్వేషన్ చేసే వీలుంటుంది. అవసరమైతే పోలీసులకు తెలియపరిచి దేశభద్రతకు తోడ్పడుతామని సర్వీసులో చేరే ముందు ప్రమాణం చేస్తారు ఆపరేటర్లు. ఎస్సై శంకర్ టెలిఫోన్ ఎక్సే్చంజ్కి వెళ్లి ఆ రోజు రాత్రి డ్యూటీ ఆపరేటర్ సుధాకర్‌ను కలిశాడు. సువాలి కేసు విషయం చెప్పి సహకరించమన్నాడు. ‘‘సార్.. ఆ రోజు అర్ధరాత్రి హాస్పిటల్ నుండి మద్దనపల్లిలోని ధరంసింగ్‌కు హెడ్ నర్స్ సరోజ ఫోన్ చేసింది. విషయం ఫోన్లో చెప్పేది కాదని, వెంటనే రమ్మంది సార్...’’ అంటూ సుధాకర్ చెప్పేసరికి తన అనుమానం బలపడింది. సుధాకర్‌కు ధన్యావాదాలు చెప్పి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. కానిస్టేబుళ్లను పిలిచి ఒకర్ని మద్దనపల్లికి, మరొకర్ని హాస్పిటల్‌కు పంపించాడు. అరగంటలో హెడ్ నర్స్ సరోజ, ఎస్సై శంకర్ ముందు హాజరైంది. ఆ రోజు లేడీ పోలీసులు లేక, తనే ఇంటరాగేషన్ చేయాల్సి వచ్చింది. ముందు మర్యాదగా ఆ రాత్రి ధరంసింగ్‌కు ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. తనకేమీ తెలియదని బుకాయించింది. ఆమె నుండి నిజం ఎలా రాబట్టాలా అని ఆలోచిస్తుండగా ధరంసింగ్‌ను తీసుకొచ్చాడు కానిస్టేబుల్. ఎస్సై శంకర్ మదిలో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ధరంసింగ్‌ను మరో గదిలోకి తీసుకెళ్లాడు.‘‘ధరంసింగ్.. సరోజ అంతా చెప్పింది. ఇక నువ్వు చెప్పాల్సిందే మిగిలింది. నిజం చెప్పు.. ఆ రాత్రి ఏం జరిగింది? నువ్వు చెప్పిందీ, సరోజ చెప్పిందీ ఒక్కటే అయితే శిక్ష తక్కువ కాలం పడుతుంది. లేదా కేసును నువ్వు పక్క దోవ పట్టించాలని ప్రయత్నిస్తే ఎక్కువ కాలం కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వస్తుంది’’ అని బెదిరించాడు శంకర్. ధరంసింగ్ కాసేపు మౌనం వహించాడు. పక్క గది నుండి సరోజ ఏడుపు వినిస్తోంది. ఎస్సై తమ పోలీసు పద్ధతిలో లాఠీ లేపి గాలిలో ఝుళిపించాడు. ‘‘సార్.. జరిగిందంతా చెబుతాను..’’ అంటూ నోరు తెరిచాడు ధరంసింగ్. అసలు విషయాన్నంతా కళ్లకు కట్టినట్లు చెప్పసాగాడు. ‘‘అర్ధరాత్రి ఒంటి గంట దాటింది. గురక పెడుతూ గాఢ నిద్రలో ఉన్నాను. ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది. రెండోసారి రింగ్ అయ్యేసరికి విసుక్కుంటూ పక్కకు దొర్లి టేబుల్ మీదున్న ఫోనెత్తాను. ‘హలో.. ధరంసింగ్’’ అవతల సరోజ గొంతు తడబడుతోంది. ‘‘ఏంది సరూ.. ఇంత అర్ధరాత్రి ఫోనేంటి??’’ నిద్రమబ్బులో విసుక్కున్నాను. ఆమె గొంతులో భయం గోచరించింది. ‘‘ధరంసింగ్ ప్లీజ్.. అర్జంటుగా రా’’ బతిమాలింది సరోజ. ‘‘ఏమైంది.. చెప్పు..’’ అంటూ అడిగాను.‘‘ఇది ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు అర్జంటుగా బయలుదేరి రా..’’ అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. సరోజ ములుగులో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో పని చేస్తోంది. స్టాఫ్ నర్స్‌గా దాదాపు పది సంవత్సరాల అనుభవముంది. ఆమె కుటుంబ పరిస్థితి అదనపు సంపాదన కోసం ఎదురు చూస్తోంది. ఇంకా ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి కావాల్సి ఉంది. ఇంటికి పెద్ద కొడుకులా కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకుంది సరోజ. తన పెళ్లైన సంవత్సరంలోనే... అదనపు కట్న సమస్యతో భర్తతో విడాకులు తీసుకుంది. నేను మంచి ఆస్తి పరుణ్ని. కాస్తో కూస్తో పట్నంలో చదువుకొని వచ్చాను. నాకు అమ్మాయిలతో తిరగడం కాలేజీ రోజుల నుంచీ ఉన్న హాబీ. ఒకసారి ఒక అమ్మాయి నెల తప్పింది. ఆమెకు అబార్షన్ చేయించే క్రమంలో ఈ సరోజ నాకు పరిచయమైంది. అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుకోవడం మొదలైంది. ఆ పరిచయం క్రమేణా వివాహేతర సంబంధానికి దారి తీసింది. నేను, నా ఫ్రెండ్స్ ఎవరైనా రహస్యంగా అబార్షన్లు చేయించాలనుకుంటే.. సరోజ దగ్గరికే పంపేవాళ్లం. ఆమె అబార్షన్లు చేస్తూ.. సొమ్ము చేసుకునేది. అప్పుడే పిల్లలు వద్దనుకునే వివాహితలకు కూడా అబార్షన్లు చేసేది. అలాగే స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలిసి, అబార్షన్లు చేయించుకునే వాళ్ల దగ్గర ఎక్కువ మొత్తం తీసుకొని అబార్షన్ చేసేది. ఆ విధంగా సరోజ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఒక కేసుకు వచ్చే ఆదాయం, ఆమె నెల జీతం కంటే రెట్టింపుగా ఉండేది. అతి రహస్యంగా, మూడో కంటికి తెలియకుండా తన పని చాకచక్యంగా చేసుకుంటూ వెళ్తూంది. హాస్పిటల్లో అయితే పీకల మీదకు వస్తుందని, తనకు అలాట్ అయిన ప్రభుత్వ క్వార్టరులో ఒక గదిని దీనికై ప్రత్యేకంగా కేటాయించుకుంది. రహస్య సంకేతంగా తలుపు చప్పుడు చేశాను. అలాంటి సంకేతం నాకు తప్ప మరెవ్వరికీ తెలియదని ధైర్యంగా తలుపు తీసింది సరోజ. నేను లోనికి రాగానే.. దబాల్న మళ్లీ తలుపు మూసేసింది.. గబాల్న నన్ను పట్టుకొని ఏడుపు అందుకుంది. ‘‘సరూ.. ఏమైంది..??’’ అంటూ బుజ్జగిస్తూ అడిగాను. ఏడుస్తూనే పక్కనున్న ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లింది. ఆపరేషన్ టేబుల్ మీద మా వదినమ్మ సువాలిని చూడగానే షాకయ్యాను. ‘‘సువాలి వదినమ్మ...! ఇక్కడికి ఎప్పుడొచ్చింది’’ అంటూ ఆశ్చర్యంగా అడిగాను సరోజని. సరోజ కళ్లు జలపాతాలయ్యాయి. ఎద నుండి తన్నుకు వచ్చే దుఃఖాన్ని అదుముకోవాలని ప్రయత్నిస్తోంది. ‘‘గత సంవత్సరమే అన్నయ్య వివాహమైంది. తను గర్భవతి అన్న సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు. అబార్షన్ చెయ్యకు సరోజా..! మా అన్నయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం’’ అంటూంటే సరోజ ఏడుపు రాగం స్థాయి మరింత పెరిగింది. ‘‘విషయం చెప్పి ఏడువు..’’ అంటూ నేను చిరుకోపం ప్రదర్శించాను. సరోజ గజగజా వణక సాగింది. పెదవులు తడబడసాగాయి. ‘‘ధరం.. నేను ఈ చేతులతో ఎన్నో కేసులు చేసిన సంగతి నీకు తెలియంది కాదు. ఎప్పుడూ ఇలా కాలేదు’’ అంటూంటే సరోజ గొంతు కూరుకు పోయింది. గొంతు సవరించుకొని మళ్లీ చెప్పసాగింది. ధరంసింగ్ నా మరిదని సువాలి చెప్పింది. అందుకే ధైర్యంగా ఒప్పుకున్నాను. తనకిప్పుడే పిల్లలు వద్దంది. మూడో నెల కాబట్టి అబార్షన్ చాలా సులభమని బల్లపై పడుకోబెట్టి ఇంజక్షన్ చేశాను. కనీసం అరగంట సమయం పడుతుంది కదా అని.. కాసేపు హాస్పిటల్ వార్డులోకి వెళ్లి పేషెంట్స్‌ను చూసొద్దామని వెళ్లాను. ఇంతలో ఒకావిడ పురిటి నొప్పులు పడుతోంది. ఆమెకు కాన్పు చేసి తిరిగి వచ్చే సరికి సువాలి చనిపోయింది’’ అంటూ తలబాదుకో సాగింది సరోజ. నేను నిశ్చేష్టుడనయ్యాను. ఆ రోజు సాయంత్రం సువాలి కనబడ్డం లేదని అన్నయ్య హీరాలాల్ అన్నప్పుడు తేలిగ్గా తీసుకున్నాను. అన్నయ్య కంగారు పడుతూ.. సువాలి తల్లి గారింటికి వెళ్లాడు. ‘‘ధరం.. ఇప్పుడేం చేద్దాం. నాకేమీ పాలుబోక నీకు ఫోన్ చేశాను’’ అంటూ కన్నీటికి మళ్లీ పని చెప్పింది. నేను ఆమె కన్నీటికి కరిగిపోయాను. చేయబోయే కార్యక్రమాన్ని ఒక్క ముక్కలో చెప్పాను. సరోజ నోరు తెరిచింది. తప్పదన్నట్లుగా పూర్తిగా తెల్లవారకముందే.. తతంగమంతా ఇరువురం కలిసి ముగించాము. ‘‘ధైర్యంగా ఉండు. ఏమీ జరగనట్లే.. యథావిధిగా డ్యూటీలో మునిగి పో..’’ అంటూ సలహా ఇచ్చి నేను తిరిగి మద్దనపల్లికి వెళ్లిపోయాను’’. ధరంసింగ్ వెనకాలే నిలబడిన సరోజ ఇదంతా వినేలా ప్లాన్ చేశాడు శంకర్. ఎవరికీ చెప్పొద్దని ఒట్టు తినిపించి ధరంసింగ్ పూసగుచ్చినట్టు అంతా చెప్పడం విని నివ్వెరపోయింది సరోజ. ‘‘ఇంతకూ ఆ తతంగమేదో చెప్పలేదు’’ అంటూ శంకర్ కుతూహలంగా అడిగాడు. లాఠీతో ధరంసింగ్ వీపును నిమురుతూ.. ‘‘సువాలి శవాన్ని సరోజ క్వార్టరు కాంపౌండ్ వాల్ ఆవరణలో పూడ్చి పెట్టాం’’ అంటూ తల పట్టుకున్నాడు ధరంసింగ్. ఇంత సులభంగా కేసు సాల్వ్ అయ్యేసరికి ఎస్సై శంకర్‌ను పోలీసులంతా అభినందించారు. - చెన్నూరి సుదర్శన్ -
జిల్లాకు 40 సంచార వైద్యసేవ వాహనాలు
ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డా. సుదర్శన్ పలమనేరు : రాష్ట్రీయ బాల్ స్వస్థా కార్యక్రమ్ (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాకు 40 సంచార వైద్యవాహనాలు వచ్చాయని ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ తెలిపారు. పలమనేరు మండలంలోని జగమర్ల, దేవళంపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఆయన తనిఖీ చేశారు.జగమర్ల పాఠశాలలో ఇద్దరు చిన్నారులు జ్వరంతో బాధపడుతుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్‌కు సమాచారం అందించి వెంటనే వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఎస్కే ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు ఈ కార్యక్రమం ద్వారా అందుతాయన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మన జిల్లాకు 126 మంది సిబ్బందిని కేటాయించిందని, వీరికి ఈ నెల 24 నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. వచ్చే నెల మొదటి వారం నుంచి జిల్లాలో సంచార వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.