నేత్రదానానికి 400 మంది అంగీకారం
నేత్రదానానికి 400 మంది అంగీకారం
Published Thu, Sep 8 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
కర్నూలు(హాస్పిటల్) : స్థానిక మారుతినగర్‌లో ఉన్న ప్రతిభ డీఎడ్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు 400 మంది నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమని కర్నూలు మెడికల్æకాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు. కాలేజీలో గురువారం నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నేత్రదానంతో ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. మరణించిన తర్వాతే నేత్రాలను సేకరిస్తారని, దీనిపై అపోహలను తొలగించుకోవాలన్నారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు నేత్రదానం చేస్తూ అంగీకార పత్రాలను అందజేశారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ కె.ఆంజనేయులు, ప్రతిభ డీఎడ్ కళాశాల గౌరవ సలహాదారు అరుణాచలంరెడ్డి పాల్గొన్నారు.
Advertisement