48 మంది బాలకార్మికులకు విముక్తి | 48 child labor relief | Sakshi
Sakshi News home page

48 మంది బాలకార్మికులకు విముక్తి

Jan 12 2017 1:59 AM | Updated on Sep 5 2017 1:01 AM

దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు, అనాథ పిల్లలకు రక్షణ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ స్మైల్‌–3

కోదాడఅర్బన్‌ : దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు, అనాథ పిల్లలకు రక్షణ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ స్మైల్‌–3లో భాగంగా ఇప్పటివరకు 48మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు కోదాడ డీఎస్పీ ఎ.రమణారెడ్డి తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదాడ సబ్‌డివిజన్‌ పరిధిలో చేపట్టిన ఆపరేషన్‌  స్మైల్‌–3 కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, కార్మిక, ఐసీడీఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలీస్‌శాఖ తరపున నేరేడుచర్ల ఎస్‌ఐతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.

 కోదాడ సబ్‌డివిజన్‌ పరిధిలోని కోదాడ పట్టణ, రూరల్, హుజూర్‌నగర్, నేరేడేచర్ల, మునగాల పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 48 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 35మంది ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించిన తరువాత వారిని శిశుసంక్షే మ కమిటీ ఎదుట హాజరుపరిచి పాఠశాలకు పంపేలా చర్య లు తీసుకుంటామన్నారు. అనాథ విద్యార్థులను గుర్తించి వా రి రక్షణ, సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. బాలకార్మికుల సమాచారం తెలిసినవారు 94407 00085 నంబర్‌కు గా నీ, 1098 హెల్ఫ్‌లైన్‌  నంబర్‌లో కానీ ఆ వివరాలను తెలి యపర్చాలని కోరారు. అదేవిధంగా తన మొబైల్‌ నంబర్‌ 83329 02421కు కూడా వివరాలు తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో సీఐలు రజితారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఆపరేషన్‌ స్మైల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ గోపి ఉన్నారు.

పీఏపల్లిలో ముగ్గురు..   
పెద్దఅడిశర్లపల్లి : ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా ఇటుకల బట్టిలో పనిచేస్తున్న ముగ్గురు బాల కార్మికులకు గుడిపల్లి పోలీసులు విముక్తి కల్పించారు. గుడిపల్లి ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద ఇటుకల బట్టిలో పని చేస్తున్న ముగ్గురు బాల కార్మికులు రంజిత్, రాజేశ్, రజితను గుర్తించి విముక్తులను చేసి నిర్వాహకుడి అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఎస్‌ఐ వెంట సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement