అనంతపురం అగ్రికల్చర్: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ– డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న 67 మంది గోపాలమిత్రలను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు ఏపీఎల్‌డీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) డాక్టర్ పీడీ కొండలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 75 మంది గోపాలమిత్రలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఈ నెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
కాగా 67 మందిని తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై సీఈవో కొండలరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ విధుల్లో చేరకపోతే తొలగిస్తామని గోపాలమిత్రలను హెచ్చరించినా వారిలో స్పందనలేదని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో వారిని తీసివేయాల్సి వచ్చిందని వివరిచారు. త్వరలోనే కొత్తగా గోపాలమిత్రల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
67 మంది గోపాలమిత్రల తొలగింపు
Published Fri, Aug 26 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
Advertisement
Advertisement