ఆటోను ఢీకొట్టిన క్రేన్.. 8 మందికి గాయాలు | 8 injured in crane accident at nalgonda district | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన క్రేన్.. 8 మందికి గాయాలు

Published Mon, Jun 27 2016 11:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

8 injured in crane accident at nalgonda district

మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement