నీటిని విడుదల చేస్తున్న మంత్రి
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- వట్టివాగు నీటి విడుదల
ఆసిఫాబాద్ : రూ.80 కోట్లతో వట్టివాగు కాల్వల మరమ్మతు చేపట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాల్వ నీటని మంత్రి ఆయకట్టుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఐదు సార్లు పర్యటించారని తెలిపారు.
ప్రాజెక్టుల నిర్వాసితుల భూ సేకరణకు రూ.వంద కోట్లు మంజూరు చేశామని, ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. భవిష్యత్తులో వట్టివాగు ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎంపీ గోడం నగేశ్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, ఇరిగేషన్ ఎస్‌ఈ భగవంత్‌రావు, ఈఈలు బద్రినారాయణ, గుణవంత్‌రావు, ఎంపీపీ తారాబాయి, వాంకిడి జెడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, ఏఎంసీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, టీఆర్‌ఎస్ నాయకులు ఎండీ మహమూద్ పాల్గొన్నారు.