కుటుంబసభ్యులతో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం బాసవరప్పాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లిబోయిన శ్రీనివాసరావు(30)కు తన మామతో కలసి మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లాడడు.
రాత్రయినా తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గ్రామ సమీపంలోని కోళ్లఫారం పక్కన బావిలో శవమై కనిపించాడు. తమ కుటుంబంలో ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయని..ఈ నేపథ్యంలోనే తన భర్త చనిపోయాడని భార్య నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ఈ మేరకు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.