కర్నూలు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజలో పాల్గొన్న డీఐజీ
పోలీసుల ఆయుధ పూజ
Published Mon, Oct 10 2016 11:55 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
కర్నూలు: దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఆయుధ పూజ నిర్వహించారు. సబ్‌డివిజన్ కార్యాలయాల్లో డీఎస్పీలు, సర్కిల్ కార్యాలయాల్లో సీఐల సమక్షంలో, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయుధాగారంలో ఎస్పీ ఆకె రవికృష్ణ కుటుంబ సమేతంగా పూజలు జరిపారు. అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, జె.బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్‌రావు, డేగల ప్రభాకర్, నాగరాజురావు, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐలు నరేష్, రామచంద్రనాయక్, రంగనాథ్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పూజలో పాల్గొన్న డీఐజీ
దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం రాత్రి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలంతా పరిశీలించారు. వివిధ కేసుల్లో పట్టు»డిన వాహనాలు కార్యాలయం వెనుక పార్క్‌చేసి ఉండటంతో వాటి యజమానులకు తక్షణమే నోటీసులు జారీ చేసి అందజేయాని చేయాలని సీఐ నాగరాజరావుకు సూచించారు.
Advertisement