aayudhapuja
-
తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో ఆయుధ పూజ
సాక్షి, తిరుమల : విజయదశమి సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సోమవారం ఉదయం ఆయుధపూజ నిర్వహించినట్లు తిరుమతి తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహార్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని, శ్రీ దుర్గామాతను ప్రార్థిస్తూ ఈ ఆయుధపూజ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. విజయదశమి రోజున పనిముట్లను, ఆయుధాలను పూజించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దుర్గామాత మహిషాసురమర్ధనం చేసి విజయం సాధించినట్టు ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయుధ పూజ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్లు వివరించారు. అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద కేంద్రంలో జరిగిన ఆయుధపూజలో ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. -
రఫేల్‌తో పెరిగిన వాయుసేన సామర్థ్యం
ప్యారిస్: రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారతీయ వాయుసేన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని, శత్రుదేశాలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, తమని తాము రక్షించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ నుంచి తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రాజ్‌నాథ్ మంగళవారం లాంఛనంగా అందుకున్నారు. శస్త్ర పూజ పేరుతో యుద్ధ విమానానికి పూజలు చేసిన తరువాత ఆయన సుమారు 25 నిమిషాలపాటు రఫేల్ విమానంలో చక్కర్లు కొట్టారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాత్మకంగా వ్యవహరించిన కారణంగానే ఇదంతా సాధ్యమైందని అన్నారు. భారత్... మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొదటివిడత 18 విమానాలు 2021 నాటికి, మిగిలినవి 2022 ఏప్రిల్, మే నెల నాటికి అందుతాయని అంచనా. రఫేల్ యుద్ధ విమానాల్లో భారత వాయుసేన నిర్దిష్టంగా ప్రతిపాదించిన 13 ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఫలవంతమైన చర్చలు.. రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్‌లు పరస్పరం సహకరించుకునే విషయంలో తాము ఆ దేశ రక్షణ మంత్రితో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. బుధవారం ఫ్రెంచ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో చర్చలు జరిపారు. -
పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్ దసరా
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొననున్నారు. ఇండో–పాక్ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్ వద్దనున్న పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఈ నెల 18న రాత్రి బికనూర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
పోలీసుల ఆయుధ పూజ
కర్నూలు: దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఆయుధ పూజ నిర్వహించారు. సబ్‌డివిజన్ కార్యాలయాల్లో డీఎస్పీలు, సర్కిల్ కార్యాలయాల్లో సీఐల సమక్షంలో, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయుధాగారంలో ఎస్పీ ఆకె రవికృష్ణ కుటుంబ సమేతంగా పూజలు జరిపారు. అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, జె.బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్‌రావు, డేగల ప్రభాకర్, నాగరాజురావు, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు నరేష్, రామచంద్రనాయక్, రంగనాథ్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న డీఐజీ దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం రాత్రి 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలంతా పరిశీలించారు. వివిధ కేసుల్లో పట్టు»డిన వాహనాలు కార్యాలయం వెనుక పార్క్‌చేసి ఉండటంతో వాటి యజమానులకు తక్షణమే నోటీసులు జారీ చేసి అందజేయాని చేయాలని సీఐ నాగరాజరావుకు సూచించారు.