నిందితుడి అరెస్టు
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడిగా ఉన్న మిడ్తూరు మండలం ఉప్పదండి గ్రామానికి చెందిన ఎస్.చిన్న బాషాను అరెస్టు చేసినుట్ల ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. జనవరి 9న మిడ్తూరు మండలం ఉప్పదండి గ్రామానికి చెందిన కోలా సంతోషిణి (20) అనే యువతిని ప్రేమ పేరుతో బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయగా ఆమె అతని నుంచి తప్పించుకుని వచ్చి కేసు పెట్టిందన్నారు. బుధవారం నిందిడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు.