atrocity
-
హైదరాబాద్ మలక్ పేట్ పీఎస్ పరిధిలో దారుణం
-
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో మరో దారుణం
-
బాలికపై వ్యభిచార ముఠా అమానుషం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కరోనాతో తల్లిని పోగొట్టుకున్న పదమూడేళ్ల బాలికను తాను చూసుకుంటానని తండ్రికి మాయమాటలు చెప్పిన ఓ మహిళ వ్యభిచార కూపంలోకి దింపింది. పలు ప్రాంతాల్లో పలువురి చేతిలో అమానుషానికి గురైన ఆ బాలిక చివరకు తప్పించుకొని వచ్చి, తండ్రికి చెప్పింది. తండ్రి వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పది రోజుల్లో కేసును ఛేదించి, 12 మంది నిర్వాహకులు, పలువురు విటులను అరెస్టు చేశారు. గుంటూరు, కృష్ణా, హైదరాబాద్, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఈ ముఠాలో నిర్వాహకులు, విటులు ఉన్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన వివరాల ప్రకారం.. హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న గుంటూరు జిల్లాకు చెందిన బాలికకు ఇటీవల కోవిడ్ సోకడంతో ఇంటికి తెచ్చారు. బాలిక తల్లికి కూడా కోవిడ్ సోకడంతో గుంటూరు ద్వారకానగర్ ఏడో వీధికి చెందిన ఎం.స్వర్ణకుమారి నాటుమందు ఇప్పిస్తానని నమ్మించింది. తన కుమార్తె ఇంటి వద్దే ఉంటుందని తండ్రి చెప్పాడు. ఈలోగా బాలిక తల్లి మృతిచెందింది. బాలికను తాను చూసుకుంటానని స్వర్ణకుమారి తండ్రిని నమ్మించి, గుంటూరు చైతన్యపురి 4వ వీధిలోని ఇంటికి తీసుకువచ్చింది. అక్కడ బాలికను నిర్బంధించి, వ్యభిచార కూపంలోకి దింపింది. విజయవాడ, కృష్ణా, తణుకు, నెల్లూరు జిల్లా, హైదరాబాద్, నెల్లూరులో వ్యభిచారం చేయించింది. నెల్లూరులో ఆమె నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ బస్టాండ్‌కు చేరింది. బాలిక అదృశ్యమైందంటూ స్వర్ణకుమారి గుంటూరు నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విజయవాడ బస్టాండ్‌లో బాలికను మరో నిర్వాహకురాలు పుణ్యవతి అలియాస్ నాగలక్ష్మి బాలికకు మాయమాటలు చెప్పి, తనతో తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. అక్కడ్నుంచి తణుకులోని శారద, అశ్విని వద్దకు పంపింది. బాలికను అశ్విని విజయవాడ తీసుకువచ్చి జేసింత, హేమలతకు అప్పగించి డబ్బులు తీసుకుంది. వారిద్దరూ బాలికతో వ్యభిచారం చేయించారు. తాను ఈ పని చేయలేనని, చదువుకుంటానని బాలిక చెప్పింది. బాలికను తీసుకుని వారు కారులో పాఠశాలకు వచ్చారు. తాము పోలీస్ మహిళా మిత్రలమని పాఠశాల యాజమాన్యానికి చెప్పి, టీసీ ఇవ్వమని కోరారు. బాలిక తండ్రికి మాత్రమే టీసీ ఇస్తామని వారు బదులిచ్చారు. వారు బాలిక తండ్రిని పిలిపించి, టీసీ తీసుకొని, తాము చదివిస్తామని విజయవాడ తీసుకెళ్లారు. మళ్లీ వ్యభిచారం చేయించడంతో, బాలిక తప్పించుకుని ఇంటికి వచ్చి తండ్రికి విషయం చెప్పింది. తండ్రి వెంటనే మేడికొండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును అరండల్ పేట పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు స్వర్ణకుమారిని, ఇతర నిందితుల్లో పలువురిని అరెస్టు చేశారు. వ్యభిచార వృత్తి నిర్వహించే స్వర్ణకుమారి గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసినట్లు పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ డి.గంగాధరం, పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ కూడా పాల్గొన్నారు. -
పదిహేను రోజుల నుంచి ఫోన్లో తిడుతున్న వ్యక్తి.. దీంతో..
సాక్షి, నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసిన్నట్లు బుదవారం స్థానిక ఎస్సై ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్లో తిడుతున్నాడు. కాగా, నిజాంపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోమ్మట బాబును గత పదిహేను రోజుల నుంచి గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా అనే వ్యక్తి బాబుపై కులం పేరుతో వ్యక్తిగత కక్షతో ఫోన్ ద్వారా బాబును ఉద్దేశించి దూషిస్తూ, బూతులు తిట్టుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు ఇవ్వగా అబ్ధుల్ పాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. -
హైదరాబాద్ కాప్రాలో దారుణం
-
టోలిచౌకిలో దారుణం
-
నందనపల్లె సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు
కర్నూలు: కర్నూలు మండలం నందనపల్లె గ్రామ సర్పంచ్ సుజాత, ఆమె భర్త సురేష్గౌడ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గ్రామ పాలనలో భాగంగా తనపై కొన్ని విషయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి చేయడమే కాకుండా, కులం పేరుతో సర్పంచు ధూషించినట్లు గ్రామ కార్యదర్శి గోవిందు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పంచుపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. అయితే కార్యదర్శి గోవిందు పరిపాలన విషయంలో తమకు సహకరించడం లేదంటూ సర్పంచ్ సుజాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కౌంటర్ కేసు నమోదైంది. 506, 509 సెక్షన్ల కింద కార్యదర్శి గోవిందుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
రైతును తరిమేశారు
-
నిందితుడి అరెస్టు
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడిగా ఉన్న మిడ్తూరు మండలం ఉప్పదండి గ్రామానికి చెందిన ఎస్.చిన్న బాషాను అరెస్టు చేసినుట్ల ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. జనవరి 9న మిడ్తూరు మండలం ఉప్పదండి గ్రామానికి చెందిన కోలా సంతోషిణి (20) అనే యువతిని ప్రేమ పేరుతో బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయగా ఆమె అతని నుంచి తప్పించుకుని వచ్చి కేసు పెట్టిందన్నారు. బుధవారం నిందిడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. -
దివ్యాంగుడిపై పోలీసుల దురాగతం
-
దారి చూపండి..
సాక్షి, సిటీబ్యూరో: ‘నగరంలో మౌలిక సౌకర్యాల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా ధ్వంసమయ్యాయి. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా అవి పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. దోమలు దండెత్తుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి...తక్షణమే స్పందించండి. ఈ సమస్యలకు పరిష్కారం చూపండి. నాలాలలపై కబ్జాలను సీరియస్‌గా తీసుకోవాలి..’ అని నగర కార్పొరేటర్లు ముక్తకంఠంతో గళమెత్తారు. సోమవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో నాలాలతోపాటు అధ్వాన్నపు రహదారులు, డెంగీ కే సులు, పారిశుధ్య కార్యక్రమాలపై సభ్యులు తమ వాణి వినిపించారు. సదరు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. నగరంలోని నాలాలన్నీ ఆక్రమణలకు గురైనందునే వరదనీరు వెళ్లే మార్గం లేక నాలాలు పొంగిపొర్లుతూ మృత్యుమార్గాలుగా మారాయన్నారు. నిబంంధనలను ఉల్లంఘించి నాలాల వెంబడి భవన నిర్మాణాలకు అనుమతులిస్తుండటంవల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు.నగరం మరో చెన్నయ్‌లా మారకుండా ఉండాలంటే అనుమతులిచ్చేముందు సంబంధిత విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. పరిస్థితులిలా ఉంటే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరదనీరు, డ్రైనేజీ కలగలసి పారుతుండటాన్ని నిరోధించాలని కోరారు. శివార్లలో సివరేజి బాధ్యతలు పూర్తిగా జలమండలికి అప్పగించాలని కోరారు. బల్కాపూర్ నాలావల్ల తీవ్ర సమస్యలు ఎదురువుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కార్పొరేటర్లందరితో సమావేశం నిర్వహించాలని కోరారు. పాతబస్తీలోని నాలాల సమస్యలపై ఒక కమిటీ వేయాలని ఎంఐఎం సభ్యులు కోరారు. నాలాలు, రోడ్ల సమస్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సూచించారు. మురికినాలా ఒక్కటే మొత్తం భారం మోయలేనందున అదనపు వరదకాలువల అవసరం ఉందని ఎమ్మెల్యే బలాలా సూచించారు. సరూర్‌నగర్ చెరువు నీటిని మూసీకి తరలించే చర్యలు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్లు కోరారు. చేపలచెరువు కబ్జాదారులను ఖాళీ చేయించాలన్నారు. గ్రేటర్‌లోని పనులన్నీ కొందరు కాంట్రాక్టర్లే చేపడుతున్నందున పనుల్లో నాణ్యత ఉండటం లేదని, వారే నగరాన్ని నాశనం చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించే పనులకు పరిమితి ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
బాలుడిపై సైకో లైంగిక దాడి
* తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న వైనం * మరో నలుగురి పైనా లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం తెనాలి రూరల్: నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రంలో సైకోగా మారిన కామాంధుడు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఐదుగురు బాలలపై దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇటీవల మరో బాలుడిపై దాడి చేయగా, ప్రస్తుతం ఆ బాలుడు తీవ్ర అస్వస్థతతో తెనాలిలోని ప్రైవేటు వైదశాలలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కొల్లిపర గ్రామానికి చెందిన సుమారు 40 ఏళ్ల వివాహితుడు సైకోగా మారాడు. స్వయానా అక్క కూతురినే వివాహం చేసుకున్న అతనికి పిల్లలు లేరు. ఆది నుంచి కొంత వికృత చేష్టలు చేస్తుండేవాడు. రాను రాను ఇది విపరీత ధోరణిగా మారింది. ఎనిమిది నుంచి 17 ఏళ్లలోపు వయసున్న బాలురను ఎంచుకుని వారిని చంపుతానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని తెలిసింది. బాలురను ఎంచుకుని, వారికి మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఐదుగురు బాలురపై లైంగికదాడి చేశాడని తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన కొల్లిపర పరిధిలో కృష్ణానది ఏరులో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తున్న 15 ఏళ్ల వయసున్న బాలుడిని అటకాయించి, గడ్డి మోపు ఉంది ఎత్తడానికి సాయం కావాలంటూ అరటి తోటలోకి తీసుకెళ్లాడు. ఎక్కడా గడ్డిమోపు ఆనవాళ్లు కనబడకపోవడంతో బాలుడు ప్రశ్నించాడు. దీంతో తన వెంట తెచ్చిన కత్తితో చంపుతానని బెదిరించి, బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. విషయం ఎవరికైనా చెబితే హతమారుస్తానని బెదిరించడంతో బాలుడు ఆ రోజు మిన్నకుండి పోయాడు. మరుసటి రోజు అదే బాలుడు తన స్నేహితుడితో కలసి సైకిల్‌పై వెళుతుంటే ‘సైకో’ కొద్ది దూరం వెంబడించాడు. రెండు రోజుల అనంతరం బాధిత బాలుడి మెడ చుట్టూ వాపు వచ్చి, తీవ్ర జ్వరం రావడంతో గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి మెడ చుట్టూ గోళ్లతో రక్కి ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించగా, బాలుడు జరిగినదంతా వారికి తెలియజేశాడు. బాలురపై లైంగిక దాడి విషయం పోలీసుల దృష్టికి వెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే సదరు సైకో తమను ఏం చేస్తాడో అన్న భయంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు రానప్పుడు ఏం చేస్తాం అన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తుండడంతో సైకో ఆగడాలకు అంతే లేకుండా పోయిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
దా‘రుణం’!
రైతు రుణమాఫీ ఓ ప్రహసనంగా మారింది. ఇదిగో తీర్చేస్తున్నాను.. అదిగో మీ ఖాతాల్లో నగదు జమ.. అంటూ బాబు ఏడాది కాలంగా మాటల గారడీతో రైతుల్ని నమ్మించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నీ బాబు తీర్చేస్తారనే నమ్మకంతో ఉన్న రైతులకు ఇప్పుడు రుణభారం పెరిగిపోతోంది. అవన్నీ వడ్డీ, అపరాధ వడ్డీతో కలిపి కొండంత అయ్యాయి. నేడు ఆ భారాన్ని మోయలేక, కొత్త అప్పులు పుట్టక ఖరీఫ్ పనులు ప్రారంభించలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో 11,29,506 మంది రైతులు రూ.9,500 కోట్లను రుణంగా తీసుకున్నారు. వీటిలో సగం పంట రుణాలు. మరో సగం బంగారు వస్తువులపై రుణాలు ఉన్నాయి. ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా తీర్చితే ఈ రుణాలన్నీ మాఫీ కావాల్సిందే. అయితే సీఎం అయిన తరువాత చంద్రబాబునాయుడు అనేక కొర్రీలు వేశారు. ఎన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా ఒక్క రుణాన్నే తీర్చుతానన్నారు. పంటను బట్టి రుణమాఫీ అమలులోకి తెచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, వాయిదాల విధానంలో అప్పులు తీర్చుతానని మరో మెలిక పెట్టారు. మీ వద్ద డబ్బు ఉంటే ముందు రుణం తీర్చేసుకోండి, తర్వాత తాను రైతు ఖాతాల్లో జమ చేస్తానన్నారు. సంవత్సర కాలంలో రూ.845.29 కోట్లను 7,70,241 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మొదట విడత రూ.543.36 కోట్లను, రెండో విడతలో రూ.301.93 కోట్లను జమ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రూ.9,500 కోట్ల హామీలో పదిశాతంలోపు మొత్తాన్నే రైతుల ఖాతాల్లో జమ చేశారు. అర్హుల జాబితాలను రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచారు. అనేక మంది రైతుల పేర్లు ఆ జాబితాలో కనపడలేదు. వీటిని సరిచేసుకోవడానికి రైతులు రెవెన్యూ శాఖ ఉద్యోగులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేశారు. రుణమాఫీకి తమకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని, జాబితాలో తమ పేరెందుకు లేదని అధికారుల్ని రైతులు నిలదీసినా ప్రయోజనం లేకపోయింది. రుణాలకు సంబంధించిన ఫిర్యాదులపై రైతులు పెద్దగా స్పందించలేదు. మొత్తం 11 లక్షల రైతుల్లో 16 వేల మంది రైతులే ఫిర్యాదులను అందచేశారు. ఈ నెలాఖరులోపు మరో రెండు వేల ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైతును వెన్నాడుతున్న రుణం .. భూ సమీకరణలో భూములు కోల్పోతున్న రాజధాని రైతును మాత్రం ఆ భూమి తాలూకా రుణం వదిలిపెట్టడం లేదు. రూ.50 వేలకుపైగా రుణం తీసుకుంటే, ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ మొత్తం రూ.50 వేలుపోను మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే కౌలు మొత్తం నుంచి మిగిలిన మొత్తాన్ని ఎలా తీర్చాలో అర్థం కాని దుస్థితిలో రాజధాని రైతు ఉన్నాడు. తొలి విడత 7,402 మంది రైతులకు రూ. 32.69 కోట్లు, రెండో విడత 620 మంది రైతులకు రూ. 11.09 కోట్లు, ఉద్యానవన పంటలను పండించే 9,129 మంది రైతులకు రూ. 37.89 కోట్లు, ఇచ్చారు. అయితే ఇక్కడి రైతుకు సాలీనా రూ.లక్ష వరకు కౌలు పొందారు. ఆ మొత్తంతో పోల్చితే ప్రభుత్వం ఇచ్చేది అరకొరే. రైతుమిత్ర, కౌలురైతులు, జేఎల్‌జీ గ్రూపులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. కొత్త రుణాలు దొరక్క.. తీసుకున్న రుణాలు తీర్చకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. మరో నెలరోజుల్లో ఖరీఫ్ సీజనుకు సంబంధించి మెట్టదుక్కులు, విత్తన సేకరణ వంటి పనుల్లో రైతు నిమగ్నం కావాల్సి ఉంది. దుక్కుదున్నేందుకు డీజిల్ ఖర్చులైనా ఇస్తేనే చేలో ట్రాక్టరు ఉంటుందని యజమాని చెబుతున్నాడు. పెద్ద రైతుల నుంచి విత్తనాన్ని అరువుకు కొనుగోలు చేసే యత్నంలో చిన్న రైతులున్నారు. మిగిలిన పనులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునేయత్నంలో రైతులున్నారు. ఒక్క రూపాయి మాఫీ అవలేదు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతక్కి బ్రాంచిలో 2013లో వ్యవసాయం నిమిత్తం రుణం తీసుకున్నాను. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానంటే ఆ డబ్బు కట్టలేదు. ఎన్నికల తరువాత రూ.50 వేల లోపు రుణాలను ఒక్క విడతలోనే తీసేస్తానంటే, బ్యాంకులో వడ్డీ కూడా కట్టలేదు. మొదటి విడతలో ఒక్క రూపాయి కూడా నాకు రుణ మాఫీ కాలేదు. ఇప్పటికే రూ.18 వేల వడ్డీ అయింది. రెండవ విడతలో కూడా రుణమాఫీ కాకపోతే, మరో రూ.7 వేలు అదనపు వడ్డీ భారం పడుతుంది. రుణమాఫీ చేయకపోతే, పుస్తెలు తాకట్టు పెట్టి అప్పు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. - పాటిబండ్ల గంగాధర్‌రావు, గుండిమెడ తడిసి మోపెడైంది.. వడ్డేశ్వరం చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం కుదువ పెట్టి రూ.50 వేలు తీసుకున్నాను. రుణమాఫీ చేస్తాం, డబ్బులు కట్టవద్దని పదే పదే ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో వడ్డీ కూడా కట్టలేదు. అది ఇప్పుడు తడిసి మోపెడయింది. బ్యాంకు వారు మీ బంగారం వేలం వేస్తామంటూ నోటీసులు పంపించారు. ఈ మధ్య కాలంలో పేపర్ ప్రకటన కూడా ఇచ్చారంట. మరి చంద్రబాబునాయుడు గారు ఈ సారైనా రుణమాఫీ చేస్తాడో, రైతులను నట్టేట ముంచుతాడో చూడాల్సిందే. బ్యాంకులో రుణం కడదామంటే ఈ సంవత్సరం ఇప్పటం గ్రామంలో పంటలు కూడా పండలేదు. - హరినాథ్‌గౌడ్, ఇప్పటం ప్రభుత్వాన్ని అడగమంటున్నారు.. నేను స్థానిక ఆంధ్రాబ్యాంకులో భూమిని తనఖా పెట్టి రూ.50 వేలు రుణం తీసుకున్నా. దానికి వడ్డీ రూ.18 వేలు అయింది. రుణమాఫీ వర్తించక పోవడంతో బ్యాంకు అధికారులను సంప్రదించా. మా కేమి తెలియదు, ప్రభుత్వాన్ని అడగండి అని సమాధానం చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీకి అన్ని కోట్లు ఇచ్చాను.. ఇన్ని కోట్లు ఇచ్చాను అంటూ చెబుతున్నారు. నాకైతే రుణమాఫీ వర్తించకపోవడంతో వడ్డీతోకలిసి అప్పు కొండంత అయింది. - నారపుశెట్టి శ్రీనివాసరావు, రైతు, రాజుపాలెం -
వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరి పై దాడి
-
సింగవరంలో దారుణం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఓ భర్త అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అడ్డువచ్చిన అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికలు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ దాడిలో గాయపడిన వారిద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలి మృతదేహన్ని కూడా పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు.