నందనపల్లె సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు
Published Mon, Mar 20 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
కర్నూలు: కర్నూలు మండలం నందనపల్లె గ్రామ సర్పంచ్ సుజాత, ఆమె భర్త సురేష్‌గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గ్రామ పాలనలో భాగంగా తనపై కొన్ని విషయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి చేయడమే కాకుండా, కులం పేరుతో సర్పంచు ధూషించినట్లు గ్రామ కార్యదర్శి గోవిందు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పంచుపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. అయితే కార్యదర్శి గోవిందు పరిపాలన విషయంలో తమకు సహకరించడం లేదంటూ సర్పంచ్ సుజాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కౌంటర్ కేసు నమోదైంది. 506, 509 సెక‌్షన్ల కింద కార్యదర్శి గోవిందుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Advertisement