పోలీసుల అదుపులో నిందితులు (కింద కూర్చున్న వారు)
-
నలుగురు నిందితుల అరెస్టు
-
20మోటార్‌బైక్‌ల స్వాధీనం
ఆమనగల్లు : తరచూ బైక్‌లను అపహరిస్తున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.పది లక్షల విలువజేసే 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఆదివారం ఆమనగల్లు పోలీసుస్టేషన్‌లో మహబూబ్‌నగర్ డీఎస్‌పీ పి.కృష్ణమూర్తి, సీఐ రవీంద్రప్రసాద్ వెల్లడించారు. వెల్దండ మండలం అప్పారెడ్డిపల్లి వాసి కొర్ర హరితేజ, వంగూరు మండలం సిరసనగండ్లకి చెందిన నేనావత్ నాగరాజు, ముడావత్ హనుమంతు, నేనావత్ రవి జల్సాలకు అలవాటు పడి తరచూ బైక్‌లను దొంగిలించసాగారు. ఇందులోభాగంగా కొన్ని నెలల్లోనే ఆమనగల్లు, మాడ్గుల, కల్వకుర్తి, వెల్దండ, ౖహె దరాబాద్ నగరంలోని సరూర్‌నగర్, మీర్‌పేట, పహడీషరీఫ్, ఇబ్రహీంపట్నంలలో 20బైక్‌లను మారుతాళాలతో దొంగిలించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం ఉదయం బైక్‌లపై ఈ నలుగురు నిందితులు ఆమనగల్లుకు వస్తుండగా సూర్యలక్ష్మీ కాటన్‌మిల్లు వద్ద ఎస్‌ఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ వాహనాలను తామే దొంగిలించినట్లు అంగీకరించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అబ్దుల్లా, రమణ, రాంరెడ్డి, కుమారస్వామి, సామ్‌సన్, వాసురాం, రామ్‌లాల్‌లను డీఎస్‌పీ అభినందించారు.