amanagal
-
దొంగల ముఠా ఆటకట్టు
నలుగురు నిందితుల అరెస్టు 20మోటార్‌బైక్‌ల స్వాధీనం ఆమనగల్లు : తరచూ బైక్‌లను అపహరిస్తున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.పది లక్షల విలువజేసే 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఆదివారం ఆమనగల్లు పోలీసుస్టేషన్లో మహబూబ్‌నగర్ డీఎస్పీ పి.కృష్ణమూర్తి, సీఐ రవీంద్రప్రసాద్ వెల్లడించారు. వెల్దండ మండలం అప్పారెడ్డిపల్లి వాసి కొర్ర హరితేజ, వంగూరు మండలం సిరసనగండ్లకి చెందిన నేనావత్ నాగరాజు, ముడావత్ హనుమంతు, నేనావత్ రవి జల్సాలకు అలవాటు పడి తరచూ బైక్‌లను దొంగిలించసాగారు. ఇందులోభాగంగా కొన్ని నెలల్లోనే ఆమనగల్లు, మాడ్గుల, కల్వకుర్తి, వెల్దండ, ౖహె దరాబాద్ నగరంలోని సరూర్‌నగర్, మీర్‌పేట, పహడీషరీఫ్, ఇబ్రహీంపట్నంలలో 20బైక్‌లను మారుతాళాలతో దొంగిలించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం ఉదయం బైక్‌లపై ఈ నలుగురు నిందితులు ఆమనగల్లుకు వస్తుండగా సూర్యలక్ష్మీ కాటన్‌మిల్లు వద్ద ఎస్ఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ వాహనాలను తామే దొంగిలించినట్లు అంగీకరించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అబ్దుల్లా, రమణ, రాంరెడ్డి, కుమారస్వామి, సామ్సన్, వాసురాం, రామ్లాల్లను డీఎస్పీ అభినందించారు. -
ఇళ్లపై దాడి
మహబూబాబాద్ రూరల్ : అమనగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతికి తమ కులస్తులే కారణమని పలువురు తమ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆస్తి నష్టం చేశారని ఎరుకల కులస్తులు కూజ అనిత, వెంకటమ్మ, మంగమ్మ, చంద్ర మ్మ, చిన్న మంగమ్మ బుధవారం తెలిపారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూజారి వీరన్న ఆగస్టు 12న గ్రామ శివారులో ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడి చికిత్సపొందుతూ అదే నెల 25న మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కారణమంటూ ఆమనగల్‌కు చెందిన బొమ్మెర రామస్వామి 40 మందిని వెంటబెట్టుకుని వచ్చి తమ కులానికి చెందిన ఎనిమిది ఇళ్లపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో తమ ఇళ్ల ధ్వంసమయ్యాయని, బియ్యం, సామాన్లు, బీరువాలు, టీవీలు, ఫర్నీచర్ పనికి రాకుండా పగులగొట్టారని వాపోయారు. తమ కుటుంబ సభ్యులపై కూడా బూతులు తిడుతూ దాడి చేశారన్నారు. పూజారి వీరన్న మృతికి తమ కులస్తులే కారణమంటూ ఇష్టం వచ్చినట్లు దాడి చేయడంతో భయాందోళనకు గురై అమనగల్ విడిచి పారి పోయి మహబూబాబాద్‌కు వచ్చి రూరల్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదుచేశామన్నారు. రూరల్ ఏఎస్సై రాజేందర్, హెడ్‌కానిస్టేబుల్ డీ.మనోహరస్వామి, పోలీసు సిబ్బంది అమనగల్‌లోని ఎరుకల కులస్తుల ఇళ్లు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు.