బీసీ సంఘాల సదస్సులో కలకలం! | Activist suicide attempt at BC meeting | Sakshi
Sakshi News home page

బీసీ సంఘాల సదస్సులో కలకలం!

Published Tue, Feb 9 2016 2:22 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Activist suicide attempt at BC meeting

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన బీసీ సంఘాల సదస్సులో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. బీసీ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తుండగా ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ వొంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. ఇది గమనించిన పక్కనున్న వాళ్లు ఆ కార్యకర్తని అడ్డుకున్నారు.

బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆ కార్యకర్త యత్నాన్ని అడ్డుకుని అతడిని మందలించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల కోసం టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement