మీ సేవల ఏఓగా ఆదినారాయణ
Published Sun, May 28 2017 12:05 AM | Last Updated on Tue, Oct 16 2018 3:38 PM
- వెంకట లక్ష్మిని తప్పించిన జేసీ
కర్నూలు(అగ్రికల్చర్): మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి బాధ్యతల నుంచి వెంకటలక్ష్మిని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తప్పించారు. తుగ్గలి తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న ఈమె డిప్యూటేషన్‌పై మీసేవ కేంద్రాల పరిపాలనాధికారిణిగా పనిచేస్తున్నారు. ఈమె పనితీరుపై జేసీకి ఫిర్యాదులు రావడంతో ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ బాధ్యతలను పరీక్షలు, ఆర్‌టీఐ సబ్జెక్టులను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ తహసీల్దారు ఆదినారాయణకు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆదినారాయణ ఇదే పోస్టులో దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు.
Advertisement
Advertisement