ఆర్‌యూ విద్యార్థుల సాహసం
ఆర్‌యూ విద్యార్థుల సాహసం
Published Sat, Nov 5 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
- బియాన్ పర్వతాధిరోహణ
- అభినందించిన వర్సటీ వీసీ
కర్నూలు(అర్బన్): రాయలసీమ విశ్వ విద్యాలయానికి విద్యార్థులు పెద్ద సాహసమే చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాన్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ పర్వతం 12,500 అడుగుల ఎత్తులో ఉంది. ఆర్‌యూకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు డీ నాగేంద్ర, మీనాసాయి, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలకు చెందిన సంతోష్, చందన, ఆదోని అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన తరుణ్ అనే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అల్లీడ్ స్పోర్ట్స్‌లో పలు రకాల శిక్షణను తీసుకున్నారు. ఆదోని అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన జోనార్దన్ విక్లీస్ ఏపీ రాష్ట్ర పురుషుల కంటింజెంట్ అధికారిగా వ్యవహరించారు. కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా జాతీయ సాహస శిబిరంలో వీరు శిక్షణ తీసుకున్నారు. పర్వతారోహణం, నదీ ప్రవాహం దాటుట, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు తదితర అంశాల్లో వీరు శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలోనే బియాన్ పర్వతాన్ని ఎక్కి అక్కడి హనుమాన్ టిబ్బా అనే పర్వతం దగ్గరికి వెళ్లి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. సింధష్త్రనదికి ఉపనది అయిన బియాన్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత –5 డిగ్రీల సీ నుంచి –17 డిగ్రీల సీ మధ్య ఉంటుంది. ఈ పర్వతాన్ని అధిరోహించిన మన విద్యార్థులకు అందిన ప్రశంసా పత్రం వల్ల ఏ దేశంలోనైనా రక్షణ రంగ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బియాన్ పర్వతాన్ని అధిరోహించి విశ్వ విద్యాలయానికి, ప్రత్యేకంగా జిల్లాకు పేరు తీసుకువచ్చిన విద్యార్థులను ఆర్‌యు వీసీ నరసింహులు, రిజిష్ట్రార్ అమర్‌నాథ్, కోఆర్డినేటర్ నరసింహులు ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement